ఇండస్ట్రీలో డెబ్యూ సినిమాతోనే హీరోయిన్లకు సూపర్ క్రేజ్ దక్కడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. అందులోనూ మొదటి సినిమాతోనే పాన్ ఇండియా క్రేజ్ దక్కితే ఆ హీరోయిన్ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ప్రస్తుతం ఆ స్థాయి ఆనందాన్ని, క్రేజ్ ని ఎంజాయ్ చేస్తోంది కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ.. ఎన్నో బ్యూటీ కాంపిటిషన్స్ లో టైటిల్స్ గెలుచుకొని కేజీఎఫ్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. అంతే.. ఈ ఒక్క సినిమా శ్రీనిధి కెరీర్ ని మలుపు తిప్పేసింది.
సాధారణంగా చాలా సినిమాలు చేస్తేగాని హీరోయిన్లకు పాన్ ఇండియా క్రేజ్ అనేది రాదు. అలాంటిది మొదటి సినిమాతోనే ఈ భామ ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇక కేజీఎఫ్-2 వచ్చాక శ్రీనిధి రేంజి మారిపోయిందని చెప్పాలి. బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ సినిమా 1200కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది. అలాగే సినిమాలో నటించిన వారితో పాటు టెక్నికల్ టీమ్ కి, కన్నడ ఇండస్ట్రీకి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ క్రమంలో కేజీఎఫ్ తో వచ్చిన క్రేజ్ ని వాడుకొని శ్రీనిధి రెమ్యూనరేషన్ పెంచేసినట్లు ఇండస్ట్రీ టాక్.
దీపం ఆరకముందే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెతను శ్రీనిధి బాగా ఫాలో అవుతున్నట్లుంది. అందుకే ప్రస్తుతం కేజీఎఫ్ తో వచ్చిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని స్టార్ హీరోయిన్స్ ని మించిన రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. స్టార్ హీరోయిన్స్ తీసుకునే రెమ్యూనరేషన్ ని రెండు సినిమాలకే అడగటం ఏంటని నిర్మాతలు షాక్ అవుతున్నారట. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీనిధి.. పేరు కావాలా? డబ్బు కావాలా? అనే ప్రశ్నకు.. డబ్బే కావాలని ఠక్కున సమాధానం చెప్పి ఆశ్చర్యపరిచింది. మరి ప్రస్తుతం అమ్మడి చేతిలో కోబ్రా సినిమా ఒక్కటే ఉంది. చూడాలి మరి.. త్వరలో కొత్త సినిమాలు అనౌన్స్ చేస్తుందేమో. మరి శ్రీనిధి శెట్టి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.