ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ ఒకే ఒక్క సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకొని అంతలోనే మాయమైపోతుంటారు. మళ్లీ ఎన్నో ఏళ్లకు గాని కెమెరా ముందు కనిపించరు. అది వాళ్ళిష్టం అనుకోండి. కానీ.. ఒక్క సినిమాతో అందరి మనసులు దోచుకున్నాక అభిమానులు ఊరుకుంటారా.. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫ్యాన్స్ అసలు ఊరుకోవడం లేదు. అభిమాన హీరోయిన్స్ ఎక్కడ, ఏ మూలన, ఏ పేరుతో ఉన్నా ఇట్టే కనిపెట్టి ఫాలో అయిపోతున్నారు. అలా టాలీవుడ్ లో ఒకే ఒక్క సినిమా చేసి మంచి క్రేజ్ సంపాదించుకున్న తెలుగు బ్యూటీ సుకృతి అంబటి.
సుకృతి అని నేరుగా పేరు చెబితే ఫ్యాన్స్ గుర్తించడం కష్టమే.. కానీ, కేరింత సినిమాలో భావన అని చెబితే ఈజీగా గుర్తుపడతారు. అవును.. 2015లో విడుదలైన కేరింత సినిమానే.. సుకృతి నటించిన ఫస్ట్ అండ్ లాస్ట్ సినిమా. కాగా, ఒకే సినిమాతో మంచి పేరు వచ్చినప్పటికీ, హైయర్ స్టడీస్ కారణంగా అబ్రాడ్ కి వెళ్ళిపోయింది ఈ బ్యూటీ. అయితే.. సోషల్ మీడియాలో మాత్రం అడపాదడపా యాక్టీవ్ గానే ఉంటోంది. అలాగే అప్పుడప్పుడు తనకు, తన ఫ్యామిలీకి సంబంధించి ఫోటోలు పోస్ట్ చేస్తుంటుంది. అలా ఈ ఏడాది జూన్ లో తన ఎంగేజ్ మెంట్ పిక్స్ షేర్ చేసి ఒక్కసారిగా అందరిని సర్ప్రైజ్ చేసింది.
ఇక ఇప్పుడు ఏకంగా పెళ్లి చేసుకొని గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవలే సుకృతి.. అక్షయ్ సింగ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని వివాహ బంధంలో అడుగుపెట్టింది. ఎంగేజ్ మెంట్ అయినప్పటి నుండే కాబోయే భర్తతో కలిసి ఫోటోషూట్స్ పోస్ట్ చేసిన సుకృతి.. రెండు రోజుల క్రితమే హల్దీ వేడుకల పిక్స్ పెట్టింది. తాజాగా తన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ దర్శనమిచ్చాయి. మొత్తానికి ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంది. సుకృతి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. అప్పటినుండి తండ్రి పెంపకంలో పెరిగింది. ఢిల్లీలో స్కూలింగ్.. రాజస్థాన్ బనస్థలి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తిచేసింది. ప్రస్తుతం సుకృతి దంపతులకు నెట్టింట ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. మరి సుకృతి దంపతులకు మీ విషెస్ కూడా కామెంట్స్ లో తెలియజేయండి.