దుల్కర్ సల్మాన్.. మమ్ముటీ కుమారుడిగా కంటే విలక్షణ నటుడిగానే ఎక్కువ పేరు సంపాదించుకున్నాడు. తెలుగులోనూ దుల్కర్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అతని సినిమాలు దాదాపు తెలుగులో కూడా విడుదల అవుతుంటాయి. ముఖ్యంగా మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానం సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు దుల్కర్ సల్మాన్ అభిమానులకు పెద్ద షాక్ తగిలింది. ఎందుకంటే దుల్కర్ పై కేరళ థియేటర్ల యజమానులు గుర్రుగా ఉన్నారు. అంతేకాదు ఇకపై దుల్కర్ సల్మాన్ నిటించిన సినిమాలు కేరళలోని థియేటర్లలో విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నారు.
ఇదీ చదవండి: జేమ్స్ సినిమా గురించి అప్పు చెప్పిన చివరి మాటలు! ఆడియో వైరల్
అందుకు కారణం దుల్కర్ సల్మాన్ నటించిన సెల్యూట్ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయడమే. రోషన్ ఆండ్రూస్ తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ సెల్యూట్. ఈ చిత్రాన్ని జనవరి 14న థియేటర్లలో విడుదల చేయాలని తొలుత భావించారు. అందుకు తగ్గట్లు డిస్టిబ్యూటర్లతో చర్చలు కూడా జరిపారు. వెంటనే కొవిడ్ మూడో వేవ్ రావడంతో విడుదల వాయిదా పడింది. పరిస్థితులు మెరుగయ్యాక ప్రేక్షకుల ముందుకు వస్తామని అప్పట్లో ప్రకటించారు. ఆ తర్వాత నేరుగా ఓటీటీ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఆ ప్రకటనతో కేరళ డిస్టిబ్యూటర్స్ అసోసియేషన్ అసహనం వ్యక్తం చేసింది. తమతో ఒప్పందం చేసుకుని కనీసం సమాచారం ఇవ్వకుండా అలా ఎలా ఓటీటీకి వెళ్తారని ప్రశ్నించారు. నిర్మాణ సంస్థ నిర్ణయంతో ఇప్పుడు ఎఫెక్ట్ అంతా దుల్కర్ పై పడింది. మరి వాళ్లు ఎంత పట్టుదలతో ఉంటారనేది వేచి చూడాలి. కేరళ డిస్టిబ్యూటర్స్ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.