దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పచుకున్న నటి కీర్తి సురేష్. తెలుగులో చేసిన మహానటి చిత్రంతో నటన పరంగా అద్భుతమైన క్రేజ్ దక్కించుకుంది. కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలనే ఎచుకుంటోంది కీర్తి. ప్రస్తుతం అమ్మడి చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. కానీ తాజాగా మరో తమిళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
తమిళనాడు సీఎం ఎస్.కె. స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ సినీ నటుడనే సంగతి తెలిసిందే. ఉదయనిధి హీరోగా రాబోతున్న కొత్త చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం చెపాక్ – తిరువల్లికేని నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సేవలందిస్తున్న ఉదయనిధి.. రాజకీయాల్లో చేరాక సినిమాలు చేయడం తగ్గించాడు. రాజకీయాల్లో కొనసాగుతూనే మంచి కథలు దొరికితే సినిమాలు చేస్తానని నిర్ణయం తీసుకున్నాడట. ఇటీవల సెల్వరాజ్ దర్శకత్వంలో ఓ మూవీ ఓకే చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ హీరోయిన్ కీర్తి సురేష్ ని సంప్రదించగా ఆమె కూడా ఒకే చెప్పినట్లు టాక్. అయితే.. కీర్తి చేతిలో చాలా సినిమాలు ఉన్నప్పటికీ ఉదయనిధి స్టాలిన్ ఎమ్మెల్యే, సీఎం తనయుడు అనే కారణాలతో సినిమా చేసేందుకు అంగీకరించిందని కోలీవుడ్ లో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇక ఈ సినిమాకు ఏఆర్.రెహమాన్ సంగీతం అందించనుండగా.. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ కీలకపాత్రలో నటించనున్నట్లు ఇండస్ట్రీలో వినికిడి. ప్రస్తుతం కీర్తి నటించిన “గుడ్ లక్ సఖి” చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు తెలుగులో మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’, మెగాస్టార్ హీరోగా ‘భోళా శంకర్’ సినిమాలు చేస్తోంది. మరి కీర్తి – ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.