టాలెంటెడ్ మలయాళీ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ నటించిన ‘ధూమమ్’ మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యి నెల రోజులు కూడా కాకుండానే ఓటీటీలోకి రాబోతుందనే న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
టాలెంటెడ్ మలయాళీ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ తెలుగు, తమిళంలోనూ నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ‘పుష్ప : ది రైజ్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి భన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్‌లో అద్భుతంగా పర్ఫార్మ్ చేసిన సంగతి తెలిసిందే. ‘పుష్ప : ది రూల్’ లో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందోననే ఆసక్తి నెలకొంది. మలయాళంలో ఫాఫద్ చేసిన సినిమాలు కొన్ని ఇతర భాషల్లోకి డబ్ అయ్యి మంచి ఆదరణ పొందాయి. అయితే ఆయన యాక్ట్ చేసిన ‘ధూమమ్’ మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యి నెల రోజులు కూడా కాకుండానే ఓటీటీలోకి రాబోతుందనే న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. జూన్ 23న మలయాళంతో పాటు కన్నడలోనూ విడుదలైంది ‘ధూమమ్’. అపర్ణ బాల మురళి కథానాయిక.
‘యూటర్న్’ ఫేమ్ పవన్ డైరెక్ట్ చేశాడు. ‘కెజీఎఫ్’, ‘కాంతారా’ వంటి ట్రెండ్ సెట్టర్ సినిమాలను నిర్మించిన హోంబలే ఫిలింస్ ప్రొడ్యూస్ చేసింది. వినీత్, అచ్యుత్ కుమార్, రోషన్ మాథ్యూ, దేవ్ మోహన్ (శాకుంతలం ఫేమ్), అనూ మోహన్, నందు ప్రధాన పాత్రల్లో కనిపించారు. కట్ చేస్తే ‘ధూమమ్’ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. థ్రిల్లర్ నేపథ్యంతో వచ్చిన ఈ మూవీ జనాలకు పెద్దగా ఎక్కలేదు. అయితే ముందుగా ఈ చిత్రాన్ని మలయాళం, కన్నడతో పాటు తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేయాలనుకున్నారు నిర్మాతలు. పేపర్లలో ప్రకటనలు కూడా ఇచ్చారు. కానీ చివరి నిమిషంలో వెనకడుగేశారు. ఓటీటీ స్ట్రీమింగ్‌లో అయినా తెలుగు వెర్షన్ వస్తుందా? లేదా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
కాగా ‘ధూమమ్’ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లోకి రావడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. రిజల్ట్ దృష్ట్యా ఇక థియేటర్లలో ఆడడం కష్టమేననుకున్నారేమో మరి ఓటీటీలో విడుదల చేయనున్నారట. అమెజాన్ ప్రైమ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ తీసుకుంది. జూలై 21 నుండి స్ట్రీమింగ్ కానుందని వార్తలు వస్తున్నాయి. అయితే దీని గురించి మూవీ టీం నుండి కానీ అమెజాన్ వైపు నుండి కానీ క్లారిటీ రాలేదు. జూన్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా నెల రోజులు కాకుండానే జూలై 21న ఓటీటీలోకి రాబోతుంది. థ్రిల్లర్ సినిమాలతో ఆకట్టుకునే దర్శకుడు పవన్ ఆడియన్స్‌ని మెప్పించలేకపోయాడు.