స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ కుర్రాడు ప్రస్తుతం ప్యాన్ ఇండియా లెవెల్‌లో పేరు తెచ్చుకున్నాడు. నటనతో అన్ని భాషల్లోనూ తనకంటూ అభిమానులను సృష్టించుకున్నారు.
స్టార్ కిడ్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం స్టార్లుగా వెలుగొందుతున్న వారు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. అలాంటి వారిలో పైఫొటోలో కనిపిస్తున్న బుడ్డోడు తప్పకుండా ఉంటాడు. స్టార్ డైరెక్టర్ కుమారుడిగా అతడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. మొదటి సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే, తర్వాత వచ్చిన చాలా సినిమాలు ఫేయిల్ అయ్యాయి. ఆయన్ని ఎంతో కృంగ దీశాయి. అయినా ఆయన వెనకడుగు వేయలేదు. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా నటనకు మెరుగులు దిద్దుకుంటూ వచ్చారు.
కరోనా ముందు వరకు కేవలం మలయాళ సినిమాకు మాత్రమే తెలిసిన అతడి టాలెంట్ తర్వాతి కాలంలో దేశం మొత్తానికి పాకింది. ఓటీటీలో ఎన్నో సూపర్ హిట్లను ఆయన సొంతం చేసుకున్నారు. నటనతో జనాలను ట్రాన్స్‌లోకి తీసుకెళుతున్నారు. ఇప్పటికే ఆ బుడ్డోడు ఎవరో మీకు అర్థం అయిపోయి ఉంటుంది. అతడే! ప్రముఖ మలయాళ హీరో ఫాహద్ ఫాజిల్. అతడు ప్రముఖ మలయాళ దర్శకుడు ఫాజిల్ కుమారుడు. ఈయన తెలుగులో నాగార్జునతో ‘కిల్లర్’ అనే సినిమా చేశారు.
ఫాజిల్ వారసుడిగా ఫాహద్ సినిమాల్లోకి వచ్చారు. 2002లో వచ్చిన ‘కైయిత్తుమ్ దూరత్’ అనే సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కేవలం మలయాళంలోనే కాకుండా తమిళం, తెలుగు సినిమాల్లో నటించారు. పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. ఆయన నటించిన సినిమాలకు ఓటీటీలో పిచ్చ క్రేజ్ ఉంటోంది. ఈయనకు అన్ని భాషల్లోనూ అభిమానులు ఉన్నారు. ఫాహద్ ప్రస్తుతం తెలుగులో ‘పుష్ప-2’ సినిమాలో నటిస్తున్నారు. నటుడిగానే కాదు.. నిర్మాతగా కూడా ఫాహద్ తన సత్తా చాటారు. దాదాపు ఎనిమిది సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.