హిందీ మార్కెట్ లో తెలుగు సినిమా సత్తాను మరోసారి రుజువు చేసింది కార్తికేయ 2 చిత్రం. ఎలాంటి అంచనాలు లేకుండా హిందీ మార్కెట్ లో కేవలం 50 షోలతో విడుదలైన ఈ సినిమా.. అన్నిచోట్లా పాజిటివ్ టాక్ తో, అద్భుతమైన కలెక్షన్స్ తో నాలుగో రోజు 1500 షోలకు విస్తరించింది. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను చందూ మొండేటి తెరకెక్కించాడు. కార్తికేయ తర్వాత సీక్వెల్ గా ఈ సినిమాను రూపొందించాడు.
ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, శ్రీనివాస్ రెడ్డి, హర్ష, అనుపమ్ ఖేర్ కీలకపాత్రలలో నటించారు. భారతీయ హిందూ సంస్కృతి, కృష్ణతత్వం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం.. దేశవ్యాప్తంగా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి అన్ని ప్రాంతాలలో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటపట్టిన కార్తికేయ 2.. ప్రస్తుతం ఉత్తరాదిలో ప్రభంజనం సృష్టిస్తోంది.
గతంలో ‘కశ్మీర్ ఫైల్స్’ ఉత్తరాదిలో ఎలాంటి స్పందన లభించిందో.. ప్రస్తుతం కార్తికేయ 2 విషయంలో కూడా అదే జరుగుతోంది. మొదటి రోజు 50 షోలతో మొదలై.. ఇప్పుడు సుమారు 1500 షోలకు పైగా ప్రదర్శితం అవుతుండడం విశేషం. యాదృచ్చికంగా కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని నిర్మించిన ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ కార్తికేయ 2ని టీజీ విశ్వప్రసాద్ తో కలిసి నిర్మించారు. మరోవైపు కశ్మీర్ ఫైల్స్ లాగే కార్తికేయ 2 దేశవ్యాప్తంగా విస్తరిస్తుండటంతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇక ఇప్పటికే 4 కోట్లకు పైగా లాభాలు రాబట్టిన కార్తికేయ 2 మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
From a mere 53 shows to 1575 shows in 4days#Karthikeya2 is gaining a massive rise in collections. Word of mouth is strong.
Film will do wonders in Hindi belt #Nikhil #Chandoomondeti @actor_Nikhil
— A V A D (@avadsays) August 17, 2022