టాలీవుడ్ లో విభిన్న కథలతో సినిమాలు చేస్తూ హీరోగా తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకున్నాడు నిఖిల్. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్న నిఖిల్.. తాజాగా ‘కార్తికేయ 2‘ సినిమా చేసిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు వరల్డ్ వైడ్ అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ఫలితంగా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ రాబట్టింది ప్రాఫిట్స్ లో చేరింది కార్తికేయ 2.
కృష్ణతత్వానికి.. అడ్వెంచర్ ని జోడించి దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమా తెరకెక్కించాడు. సరికొత్త కథతో కంటెంట్ ప్రధానంగా రూపొందించిన ఈ సినిమా.. పాజిటివ్ మౌత్ టాక్ తో బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. కార్తికేయ 2 హీరో నిఖిల్ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది. ఇక మూవీలో అందరి యాక్టింగ్ తో పాటు విజువల్స్, స్టోరీ లైన్ పై విమర్శకుల ప్రశంసలు కురుస్తున్నాయి. అలాగే సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో రిలీజ్ అయ్యింది.
కార్తికేయ 2 మూవీ 3 రోజుల కలెక్షన్స్ చూసినట్లయితే..
AP-TG: 11.54 కోట్ల షేర్(17.80 కోట్ల గ్రాస్)
వరల్డ్ వైడ్: 15.44 కోట్లు షేర్ (26.50 కోట్ల గ్రాస్)
నిఖిల్ కెరీర్ లోనే ఇంత త్వరగా బ్రేక్ ఈవెన్ అవ్వడం అనేది ఇదే మొదటిసారి అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘కార్తికేయ 2’ అంచనాలకు అనుగుణంగా వరల్డ్ వైడ్ రూ. 12.80 కోట్ల మేర బిజినెస్ చేసింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.30 కోట్లుగా నమోదైంది. ఇక మూడు రోజుల్లో రూ. 15.44 కోట్లు షేర్ రావడంతో.. మూడో రోజే రూ. 2 కోట్ల ప్రాఫిట్స్ సాధించి బ్లాక్ బస్టర్ లిస్టులో చేరింది. ఇక కార్తికేయ 2 మూవీని అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. మరి కార్తికేయ 2 సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#Karthikeya2 3 Days Collections…!
Follow Us For More Updates….!#karthikeya2 #KrishnaIsTruth pic.twitter.com/GTtGKxWuAQ— TollyTalks (@TollyTalks123) August 16, 2022