స్టార్ బాయ్ సిద్ధు, మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నారు. యూత్‌కి సాలిడ్ కిక్ ఇచ్చే లవ్, రొమాన్స్‌తో రెచ్చిపోయారు. వీరిద్దరి కెమిస్ట్రీ కేకో కేక అంటూ పోరగాళ్లు కామెంట్స్ చేస్తున్నారు.
స్టార్ బాయ్ సిద్ధు, మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నారు. యూత్‌కి సాలిడ్ కిక్ ఇచ్చే లవ్, రొమాన్స్‌తో రెచ్చిపోయారు. వీరిద్దరి కెమిస్ట్రీ కేకో కేక అంటూ పోరగాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. మొన్న ఈ సినిమా నుంచి ‘టికెట్టే కొనకుండా’ అనే సాంగ్ ప్రోమో రిలీజ్ చేస్తే ఎంతలా వైరల్ అవుతుందో తెలిసిందే. సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ మూవీతో యూత్ ఆడియన్స్‌లో కిరాక్ క్రేజ్ తెచ్చుకున్నాడు. పక్కా తెలంగాణ నేపథ్యంతో, పక్కింటి అబ్బాయి తరహా పాత్రలో నటించి మెప్పించడమే కాక, స్క్రిప్ట్ రాసి మరీ ఆకట్టుకున్నాడు. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్’ రాబోతోంది. మల్లిక్ రామ్ దర్శకత్వంలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
సెప్టెంబర్ 15న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. బుధవారం ‘టిల్లు స్క్వేర్’ లోని ఫస్ట్ లిరికల్ సాంగ్ వదిలారు మేకర్స్. ఈసారి డబుల్ డోస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండబోతుందని ప్రోమోతోనే హింట్ ఇచ్చిన టీం అంచనాలనకు ఏమాత్రం తగ్గకుండా సాంగ్ డిజైన్ చేశారు.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ రామ్ మిర్యాల సంగీతమందిస్తున్నాడు. ట్యూన్ కంపోజ్ చేయడంతో సూపర్‌గా పాడాడు. కాసర్ల శ్యామ్ బ్యూటిఫుల్ లిరిక్స్ రాశారు.
‘‘టికెట్టే కొనకుండా లాటరి కొట్టిన సిన్నోడా.. సిట్టి నీది సిరుగుతుందేమో సూడరా బుల్లోడా.. మూసుకోని కూసోకుండా గాలమేశావ్ పబ్బు కాడా.. సొర్ర సేపే తగులుకుంది, తీరింది కదరా, మురిసిపోక ముందున్నాది కొంపకొల్లేరయ్యే తేదీ.. గాలికి పోయే గంప నెత్తికొచ్చి జుట్టుకున్నాది.. ఆలు లేదు, సూలూ లేదు, గాలే తప్ప మేటరు లేదు.. ఏది ఏమైనా గానీ టిల్లుగానికడ్డే లేదు.. టిల్లన్నా ఎలాగన్నా.. స్టోరీ మళ్లీ రిపీటేనా.. పోరీ దెబ్బకు మళ్లీ నువ్వు తానా తంథానా.. టిల్లన్నా ఎట్లా నీకు జెప్పాలన్నా.. తెల్సీ తెల్వక జేస్తావన్నా..ఇళ్లే పీకి పందిరి వేస్తావ్ ఏందీ హైరానా’’ అంటూ సాగే ఈ సాంగ్ సింప్లీ సూపర్బ్ అనేలా ఉంది. యూత్ పోరగాళ్లు థియేటర్లలో రచ్చ రచ్చ చేయడం పక్కా అని చెప్పొచ్చు.
ఇది కూడా చదవండి : అర్జున్ రెడ్డి నటికి చేదు అనుభవం.. ఫ్లైట్‌లో అక్కడ కాళ్ళు పెట్టి..