యూత్‌ని టార్గెట్ చేస్తూ.. లవ్, రొమాన్స్ వంటివి హైలెట్ చేస్తూ తెరకెక్కే సినిమాలకు తిరుగుండదు. యువతను థియేటర్లకు రప్పిస్తూ, కాసుల కనక వర్షం కురిపించిన బొమ్మలు చాలానే ఉన్నాయి. లేటెస్ట్ సెన్సేషన్ ‘బేబి’ గురించి ఎంత చెప్పినా తక్కువే.
యూత్‌ని టార్గెట్ చేస్తూ.. లవ్, రొమాన్స్ వంటివి హైలెట్ చేస్తూ తెరకెక్కే సినిమాలకు తిరుగుండదు. యువతను థియేటర్లకు రప్పిస్తూ, కాసుల కనక వర్షం కురిపించిన బొమ్మలు చాలానే ఉన్నాయి. లేటెస్ట్ సెన్సేషన్ ‘బేబి’ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ఆ మధ్య ‘డీజే టిల్లు’ అంటూ యూత్ పోరగాళ్లలో కిరాక్ క్రేజ్ తెచ్చుకున్నాడు. పక్కా తెలంగాణ నేపథ్యంతో, పక్కింటి అబ్బాయి తరహా పాత్రలో నటించి మెప్పించడమే కాక, స్క్రిప్ట్ రాసి మరీ ఆకట్టుకున్నాడు. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్’ రాబోతున్న సంగతి తెలిసిందే. సిద్ధుకి జోడీగా మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది.
మల్లిక్ రామ్ దర్శకత్వంలో, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సెప్టెంబర్ 15న రిలీజ్ డేట్ లాక్ చేసుకుని రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ‘టిల్లు స్క్వేర్’ నుంచి సోమవారం సాయంత్రం సాలిడ్ అప్డేట్ ఇచ్చింది టీం. ‘టికెటే కొనకుండా’ అనే సాంగ్ ప్రోమో వదిలారు. ఈసారి డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుందని హింట్ ఇచ్చారు. సిద్ధు మార్క్ మేనరిజమ్స్, యాటిట్యూడ్ అండ్ డైలాగ్ డెలివరీతో, అనుపమ అందాలతో ప్రోమో అదిరిపోయింది. రామ్ మిర్యాల సంగీతమందిస్తున్న ఈ ఫస్ట్ లిరికల్ సాంగ్ జూలై 26న రిలీజ్ కానుంది.
రామ్ మిర్యాల ట్యూన్ కంపోజ్ చేయడంతో పాటు పాడగా.. కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాశారు. సిద్ధు షూస్ క్లీన్ చేస్తూ.. ‘మనసు విరిగినట్టున్నద్ది ఎక్కడ్నో.. ఉన్నడా బాయ్ ఫ్రెండ్?’ అని అడిగితే.. అనుపమ ‘నీకెందుకు?’ అంటూ ‘ఇప్పుడే కదరా కలిశాం.. అప్పుడే ఓపెన్‌గా ఫ్లర్ట్ చేస్తావా?’ అనడం.. దానికి సిద్ధు కిరాక్ ఆన్సర్ ఇవ్వడం.. ‘పోయినసారి అంతైనా కూడా సిగ్గురాలే టిల్లన్నకి’ అంటూ మరో క్యారెక్టర్ పంచ్ ఇవ్వడంతో ఎండ్ అయిన ప్రోమో మాత్రం తెగ వైరల్ అవుతోంది. ఇక ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో.. సినిమా ఇంకెంత రచ్చ రంబోలా చేస్తుందోనంటూ టిల్లు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : ఈ ఫోటోలో ఉన్న బాబుని గుర్తు పట్టారా? మూవీ, పొలిటికల్ బ్యాగ్రౌండ్!