టాలీవుడ్ లో భిన్న కథలతో సినిమాలు చేస్తూ హీరోగా తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకున్నాడు నిఖిల్. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్న నిఖిల్.. తాజాగా ‘కార్తికేయ 2‘ సినిమా చేసిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు వరల్డ్ వైడ్ అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ఫలితంగా రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా కలెక్షన్లు రాబట్టింది కార్తికేయ 2.
కృష్ణతత్వం.. అడ్వెంచర్.. ఈ రెండూ అంశాలను జోడించి దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమా తీశాడు. సరికొత్త స్టోరీ పాయింట్ తో కంటెంట్ ప్రధానంగా రూపొందించిన ఈ సినిమా.. పాజిటివ్ మౌత్ టాక్ తో బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. కార్తికేయ 2 హీరో నిఖిల్ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక మూవీలో అందరి యాక్టింగ్ తో పాటు విజువల్స్, స్టోరీ లైన్ పై విమర్శకుల ప్రశంసలు కురుస్తున్నాయి. అలాగే సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో రిలీజ్ అయ్యింది.
కార్తికేయ 2 రెండవ రోజు కలెక్షన్స్ చూసినట్లయితే..
ప్రపంచవ్యాప్తంగా రూ. 17.30 కోట్లు గ్రాస్.. రూ. 10.5 కోట్లు షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘కార్తికేయ 2’ అంచనాలకు తగ్గట్టుగా వరల్డ్ వైడ్ రూ. 12.80 కోట్ల మేర బిజినెస్ చేసింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.30 కోట్లుగా నమోదైంది. రెండు రోజుల్లో రూ. 10.5 కోట్లు షేర్ రావడంతో.. మరో 3 కోట్లు రాబడితే సినిమా బ్లాక్ బస్టర్ లిస్టులో చేరుతుంది. ఇక కార్తికేయ 2ని అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. మరి కార్తికేయ 2 సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#Karthikeya2 2Days WW Collections
👉Extraordinary Day2
👉Will Complete Break Even Today👉AP/TS – 7.39CR (11.15CR Gross)
👉KA+ROI – 45L
👉OS – 2.50CR
👉Hindi – 16L
Total WW – 10.5CR (17.30CR Gross)👉Break Even – 13.50CR
👉Movie Need Another 3CR#NikhilSiddharth #Anupama pic.twitter.com/yUkYuTk7iq— Masthi Movie (@MasthiMovie123) August 15, 2022