పండుగల సమయం వచ్చిందంటే చాలు.. బుల్లితెర ప్రేక్షకులకు టీవీ ప్రోగ్రామ్స్ అందించే వినోదం వేరే లెవెల్ లో ఉంటుంది. ముఖ్యంగా రోజూ కనిపించే సీరియల్ స్టార్స్ అంతా ఫెస్టివల్ స్పెషల్ ఈవెంట్ లలో చేసే సందడి కూడా అలాగే ఉంటుంది. అయితే.. తెలుగు సీరియల్ కపుల్స్ తో హోలీ స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేసిన ప్రోమోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ‘కార్తీక దీపం‘ సీరియల్ ఫేమ్ డాక్టర్ బాబు(కార్తీక్), మోనిత జంటగా ఓ రొమాంటిక్ సాంగ్ కు చేసిన పెర్ఫార్మన్స్ హైలైట్ అవుతోంది. ఎందుకంటే.. కార్తీక దీపం సీరియల్ లో కార్తీక్ హీరో కాగా, మోనిత(శోభాశెట్టి) విలన్ రోల్ చేసింది. ఈ మధ్యకాలంలో ఏ సీరియల్ కి లేని ఆదరణ కార్తీక దీపం సీరియల్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ‘ఈ హోలీకి తగ్గేదేలే’ అంటూ ప్లాన్ చేసిన ఈ స్పెషల్ ఈవెంట్ లో కార్తీక్, మోనిత జంటస్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.సఖియా చెలియా.. అంటూ సాగే పాటకు కార్తీక్, మోనితను ఎత్తుకొని చేసిన స్టెప్ కి విజిల్స్ వేస్తున్నారు. కానీ రొమాంటిక్ సాంగ్ కాబట్టి ఇద్దరూ పోటాపోటీగా పెర్ఫర్మ్ చేశారు. వేరే జంటలు కూడా పాల్గొన్నా కార్తీక దీపం జంటే ఆకర్షణగా నిలవడం విశేషం. మరి ఈ హీరో, విలన్ జంటగా స్టేజి ఎక్కినా కూడా క్రేజ్ తగ్గలేదంటే.. కార్తీక దీపం సీరియల్ క్రేజ్ ఏ రేంజిలో ఉందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. మరి నిరుపమ్(కార్తీక్), శోభాశెట్టి(మోనిత) డాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.