Karnataka CM: ఎలాంటి భావోద్వేగాలకైనా మనిషి లోనవడం అనేది మామూలే. ముఖ్యంగా ఎమోషనల్ మూమెంట్స్ లేదా తెరపై ఎమోషనల్ సన్నివేశాలను చూసినప్పుడు వెంటనే భావోద్వేగానికి గురవుతుంటారు. తాజాగా ఓ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి ఓ సినిమా చూసి ఎమోషనల్ అయిపోయి కంటతడి పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన ఎమోషనల్ అయిన వీడియో, ఆయన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అంతలా ఎమోషనల్ అయిన సీఎం ఎవరంటే.. కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై గారు.
తాజాగా సీఎం బసవరాజ్ బొమ్మై గారు ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో కన్నడ సినిమా ‘777 చార్లీ’ సినిమా చూశారు. మనిషికి, పెంపుడు కుక్కకు మధ్య అనుబంధాన్ని ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించిన ఈ సినిమాను ప్రత్యేక షో వేయగా.. సీఎం బసవరాజ్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురై ఏడ్చేశారు. అయితే.. చార్లీ సినిమా చూసి సీఎం అంతలా ఎమోషనల్ అవ్వడానికి కారణం లేకపోలేదు. గతంలో ఆయన ‘సన్నీ’ అనే పెంపుడు కుక్కను పెంచారు.
ఆ కుక్క దాదాపు 14 ఏళ్లపాటు ఆయన ఫ్యామిలీ సాన్నిహిత్యంలో పెరిగిందట. అయితే.. బసవరాజ్ గారు ముఖ్యమంత్రిగా పదవీ చేపట్టే సమయానికి ముందే ఆ కుక్క చనిపోయింది. ఇక ఎంతో ప్రేమగా అన్నేళ్లపాటు తమ వద్ద పెరిగిన సన్నీ చనిపోయినప్పుడు.. దాని అంత్యక్రియలు చేసేముందు బొమ్మై వెక్కివెక్కి ఏడ్చేశారు. ఇదిలా ఉండగా.. చార్లీ సినిమాలో కూడా కుక్కతో ఉన్న బాండింగ్ చూసేసరికి సీఎం ఎమోషనల్ అవ్వడమేగాక కెమెరా ముందు ఏడ్చేశారు.
Chief minister Basavaraj Bommai broke down after watching #777Chalie yesterday. The movie reminded him of his pet dog. Avid dog lover, Bommai when he was home minister, his pet died and these pics went viral.#Dogs♥️ pic.twitter.com/BtxYRigtwh
— Ashwini M Sripad/ಅಶ್ವಿನಿ ಎಂ ಶ್ರೀಪಾದ್🇮🇳 (@AshwiniMS_TNIE) June 14, 2022
చార్లీ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ.. ‘కుక్కల మీద గతంలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ.. ఈ సినిమాలో ఎమోషన్స్ చూపించారు. చార్లీ కేవలం తన కళ్ల ద్వారా భావోద్వేగాలను వ్యక్తపరుస్తుంది. సినిమా చాలా బాగుంది, అందరూ తప్పకుండా చూడాలి. అన్ కండిషనల్ లవ్ గురించి చెబుతున్నాను. కుక్క ప్రేమ కూడా అలాంటిదే. స్వచ్ఛమైనది” అని చెప్పారు. ప్రస్తుతం సీఎం బొమ్మై మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.