అవమానం అనేది ఎంత ఫోర్స్‌గా ఉంటే.. దాన్నుంచి వచ్చే అవుట్ పుట్ కూడా అంతే ఫోర్స్‌లో ఉంటుంది. దాని పేరే సక్సెస్. ఒకానొక సమయంలో కొందరు కొంతమందికి నచ్చరు. వెంటనే అక్కడి నుండి వాళ్ళని గెంటేస్తారు. కట్ చేస్తే గెంటివేయబడ్డ వ్యక్తి పెద్ద సెలబ్రిటీ అయిపోతాడు. ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది గెంటివేయబడి సక్సెస్ అయిన వాళ్ళే. ఇలాంటి అనుభవమే బాలీవుడ్ బుల్లితెర హోస్ట్ కపిల్ శర్మకు ఎదురైంది. అది 2001వ సంవత్సరం. అప్పుడు సన్నీడియోల్, అమీషా పటేల్ జంటగా గడార్ సినిమా షూటింగ్ జరుగుతుంది.
షూటింగ్‌లో భాగంగా స్టంట్ డైరెక్టర్ టిను వర్మ.. కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆ యాక్షన్ సన్నివేశాల్లో కపిల్ శర్మ పాల్గొన్నారు. అయితే కపిల్ శర్మ స్టంట్ డైరెక్టర్ చెప్పిన దానికి విరుద్ధంగా చేశారు. దీంతో టిను వర్మ కోపంతో కట్ చెప్పారు. కపిల్‌ను పిలిచి, చెప్పింది ఏంటి.. చేసింది ఏంటి.. అంటూ అరిచారు. నీ వల్ల షాట్ వృధా అయ్యిందని తిట్టారు. రెండవ టేక్‌లో కూడా కపిల్ శర్మ సరిగా చేయకపోవడంతో.. ఇలాంటి వాళ్ళను ఎందుకు రానిస్తారంటూ కపిల్‌ను మెడ పట్టి బయటకు గెంటేశారు.
ఆరోజు అలా బయటకు గెంటివేయబడ్డ కపిల్.. ఈరోజు దేశంలోనే అత్యంత పాపులారిటీ కలిగిన ‘ది కపిల్ శర్మ షో‘కి హోస్ట్‌గా ఉన్నారు. 2016లో స్టార్ట్ అయిన ఈ షో ఇంకా కొనసాగుతూనే ఉంది. మూడు సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న ఈ షో నాల్గవ సీజన్‌లోకి అడుగుపెడుతోంది. వేదిక ఏదైనా, గెస్ట్‌లు ఎవరైనా గానీ కపిల్ షో అయితే చాలు అది సూపర్ హిట్ అనే స్థాయికి ఎదిగారు. అలాంటి కపిల్ శర్మను గతంలో గడార్ సినిమా షూటింగప్పుడు బయటకు తోసివేశానంటూ స్వయంగా టిను వర్మ ‘ది ముఖేష్ ఖన్నా షో’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్నా కూడా ఎదగడానికి చాలా కష్టపడ్డాడని, అవకాశం లేదు అన్న చోట ప్రయత్నించి విజయాన్ని సొంతం చేసుకున్నాడని టిను వర్మ అన్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.