సినీ ఇండస్ట్రీలో హీరో అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ తరహా మాస్ ఇమేజ్ సంపాదించాడు అజిత్ కుమార్. తెలుగు ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. కోలీవుడ్ లో మంచి సక్సెస్ సాధించాడు. ప్రముఖ నటి షాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా తనలోని పవర్‌ను అభిమానులకు చాటి చెప్తున్నారు. వివరాల్లోకి వెళితే.. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నాలుగు బంగారు పతకాలు సాధించాడు. సినిమాలో కాదు.. నిజంగానే నటుడు అజిత్ ఈ పతకాలు సాదించాడు. అజిత్ కుమార్ బైక్ రేస్ లో ఇప్పటి వరకు ఎన్నో పథకాలు సాధించారు. తాజాగా ఇప్పుడు తమిళనాడలో జరుగుతున్న రాష్ట్రస్థాయి షూటింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో అజిత్ కుమార్ తో పాటు అతడి టీమ్ నాలుగు బంగారు పతకాలు, రెండు కాంస్య పతకాలను గెలుచుకున్నారు. Latest pic Ajith Sir #AK61 #AjithKumar #AK62 #AK #வெற்றிநாயகன்அஜித் pic.twitter.com/lykfikeeEr — Ajith (@ajithFC_2) July 30, 2022 సెంటర్ ఫైర్ పిస్టల్ మెన్, స్టాండర్డ్ పిస్టల్ మాస్టర్ మెన్, 50 మీటర్స్ విభాగాల్లో బంగారు పతకం సాధించారు. అంతేకాకుండా 50 మీటర్ల ఫ్రీ పిస్టల్ మెన్, స్టాండర్డ్ పిస్టల్ మెన్ విభాగాల్లో వారు కాంస్యం సాధించి తమ సత్తా చాటారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. This Is More Than Enough For A Fanatic To Be Proud Of Their Leader Really Proud Of You THALAivaa❤️#AK61#AjithKumar #வெற்றிநாயகன்அஜித் pic.twitter.com/arYQSK1Mik — AJITH KUMAR FANS KANNUR (@AfcKannur) July 31, 2022