తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే కొంత మంది ఆ వ్యాఖ్యలను సమర్థిస్తుంటే.. మరికొంత మంది మాత్రం విమర్శిస్తున్నారు. అయితే ఒక మహిళ అయ్యి ఉండి మిగతా మహిళను కించపరుస్తూ మాట్లడ్డం ఏంటని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుత సమాజంలో నిజాన్ని నిజం అని చెప్పడానికి, అది నిజం అని ఒప్పించడానికి మరో నిజం కావాలి. వినడానికి కాస్త తికమకగా ఉన్నా ఇదే నిజం. అయితే ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు చేసే కొన్ని మాటలు నెట్టింట వైరల్ గా మారుతుంటాయి. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే కొంత మంది ఆ వ్యాఖ్యలను సమర్థిస్తుంటే.. మరికొంతమంది మాత్రం విమర్శిస్తున్నారు. అయితే ఒక మహిళ అయ్యి ఉండి మిగతా మహిళను కించపరుస్తూ మాట్లడ్డం ఏంటని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంతకి ఆ స్టార్ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సోనాలి కులకర్ణి.. కన్నడ, హిందీ, గుజరాతీ, మరాఠీ సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసి ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే వివాదాలకు దూరంగా ఉండే ఈ అమ్మడు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సోనాలి కులకర్ణి మాట్లాడుతూ..”దేశంలో ఆడవారికి లేజీనెస్ ఎక్కువైంది. పురుషులు 16 ఏళ్లకే కష్టపడుతున్నారు. కానీ అమ్మాయిలు మాత్రం 25 సంవత్సరాలు వచ్చినా కూడా.. తమ అవసరాలను తీర్చడానికి బాయ్ ఫ్రెండ్ ను, భర్తను కోరుకుంటున్నారు. పెళ్లి అయ్యాక మాకు అవి కావాలి, ఇవి కావాలి అని మగాళ్లను ఇబ్బంది పెడుతుంటారు. ఇక అమ్మాయిలకు తాము పెళ్లి చేసుకోబోయే అబ్బాయిలకు పెద్ద ఇల్లు ఉండాలి, రూ.లక్షల్లో జీతం ఉండాలి, కారుండాలి అని గొంతెమ్మ కోరికలు కోరుతుంటారు” అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది సోనాలి కులకర్ణి.
అయితే అమ్మాయిలు అయినా అబ్బాయిలు అయినా జీవితంలో కష్ట సుఖాలను సమానంగా పంచుకోవాలని ఈ సందర్భంగా సోనాలి చెప్పుకొచ్చింది. ఇన్ని సమస్యలు అమ్మాయిలో సృష్టిస్తూ.. పైగా మానవ హక్కుల అధికారులకు కంప్లైట్స్ ఇస్తారని సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో వైరల్ కావడంతో.. మగాళ్లు ఆమెకు సపోర్ట్ గా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అవును మేడం మీరు చెప్పింది 100కు 100 శాతం నిజం అని కొందరు మగమహరాజులు చెప్పుకొస్తున్నారు. మరి దేశంలో ఆడవారికి సోమరితనం ఎక్కువైంది అన్న సోనాలి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.