ఆమెని చూస్తే ఎల్లోరా శిల్పమే గుర్తొస్తుంది. అందానికి ఏకంగా గుడి కట్టేయొచ్చు బాబోయ్ అనేస్తారు. ఎందుకంటే అంతా బాగుంటుంది మరి. ఐటమ్ సాంగ్స్ తో యమ క్రేజ్ తెచ్చుకున్న ఈమె డ్యాన్స్ మెంటలెక్కిపోతారు. మరి ఇదంతా ఎవరి గురించో కనిపెట్టారా?
సినిమాల్లో హీరోయిన్ అందంగా కనిపిస్తే చాలు.. అందరూ ఆమెని క్రష్ లిస్టులోకి యాడ్ చేసేస్తారు. సోషల్ మీడియాలో ఎన్ని అకౌంట్స్ ఉంటే అన్నింటిని ఫాలో అయిపోతారు. ఆమె పోస్ట్ చేసే ప్రతి ఫొటోని అలా చూస్తుండిపోతారు. ఇప్పటివరకు వందలాది మంది హీరోయిన్లని ఆదరించిన ప్రేక్షకులు.. ఎంతమంది వచ్చినా అదే రేంజులో అక్కున చేర్చుకుంటున్నారు. అదిదా ఆడియెన్స్ అంటే! అలా కోట్లాదిమందికి ఫేవరెట్ అయిపోయిన ఓ బ్యూటీ.. పిచ్చెక్కించే ఔట్ ఫిట్స్ తో రెచ్చగొడుతూ, డ్యాన్స్ లతోనూ కాక రేపుతోంది. ఈమెకు సౌత్ నార్త్ అనే తేడా అస్సలే ఉండదు. మరి ఇంతలా చెబుతున్నాం కదా.. ఆ ముద్దుగుమ్మ ఎవరనేది గుర్తుపట్టారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి పేరు జాక్వెలిన్ ఫెర్నాండెజ్. బాలీవుడ్ లో హీరోయిన్ గా యమ క్రేజ్ తెచ్చుకున్న ఈమె.. ప్రభాస్ ‘సాహో’లో ఐటమ్ సాంగ్ కూడా చేసింది. ఓసారి గుర్తుతెచ్చుకోండి. అలా తెలుగు ప్రేక్షకులకు కాస్తోకూస్తో పరిచయమే. రెగ్యులర్ గా హిందీ మూవీస్ చూసేవాళ్లకు ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వతహాగా శ్రీలంకన్ అయిన ఈమె.. పుట్టింది మాత్రం బహ్రెయిన్ దేశంలో. తండ్రిది లంక, తల్లిది కెనడా కావడంతో జాక్వెలిన్ చూడటానికి ఇంగ్లీష్ అమ్మాయిలా ఉంటుంది. తొలుత హాలీవుడ్ యాక్టర్ అవ్వాలనుకుంది కానీ 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంకగా టైటిల్ అందుకున్న తర్వాత లంకలోనే పలు టీవీ షోలు చేసింది.
ఇక 2009లో ‘అల్లాదీన్’ మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన జాక్వెలిన్.. ఆ తర్వాత ఇక్కడే సెటిలైపోయింది. సల్మాన్ ఖాన్ తో చాలా సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. బయట కూడా ఈ హీరోతోనే ఎక్కువగా కనిపించేది. హీరోయిన్, స్పెషల్ సాంగ్స్ యమ క్రేజ్ తెచ్చుకున్న జాక్వెలిన్.. గతేడాది ‘విక్రాంత్ రోణ’లో రా రా రక్కమ్మా పాటతో ఫుల్ ఫేమస్ అయిపోయింది. ప్రస్తుతం హిందీలోనే రెండు మూడు చిత్రాలు చేస్తోంది. తాజాగా ఈమెకు సంబంధించిన చిన్నప్పటి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. చాలా క్యూట్ గా ఉందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ బ్యూటీ చైల్డ్ హుడ్ పిక్ చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.