Kamal Haasan: శంకర్ డైరెక్టర్‌గా పరిచయమైన మొదటి సినిమా ‘జెంటిల్ మ్యాన్’. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సినిమా తమిళ సినిమా చరిత్రలో ఓ నూతన అధ్యాయంగా నిలిచింది. 1992 ప్రాంతంలో అధిక బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాగా ‘జెంటిల్ మ్యాన్’ చరిత్ర సృష్టించింది. ఈ సినిమా విడుదలైన తర్వాత సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. 1993లో అత్యధిక వసూళ్లను సాధించటమే కాకుండా.. అవార్డుల పంట పండించింది. జెంటిల్ మ్యాన్ హిందీలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా అదే పేరుతో తెరకెక్కింది. అక్కడ కూడా మంచి విజయాన్నే అందుకుంది.
ఇక, ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. అప్పటి వరకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న శంకర్.. ‘జెంటిల్ మ్యాన్’ కథను సిద్ధం చేసుకున్నారు. ఆయనే ఆ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. ఆ కథలో హీరో పాత్ర కోసం మొదటగా కమల్ హాసన్‌ను అనుకున్నారు. కథతో కమల్ దగ్గరకు వెళ్లారు. ఆ కథ విన్న కమల్ కథ నచ్చలేదని శంకర్ ముఖం మీదే చెప్పేశారు. కథలో మార్పులు కూడా చేయమని సలహా ఇచ్చారు. మార్పులు చేసిన కథ ‘అర్జున్’ దగ్గరకు వెళ్లింది. ఆయన ఓకే చేశారు. తాను ‘జెంటిల్ మ్యాన్’ కథను రిజెక్ట్ చేసిన సంగతిని కమల్ హాసన్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
అది పాత ఇంటర్వ్యూ అయినప్పటికి మళ్లీ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో కమల్ హాసన్ మాట్లాడుతూ.. ‘‘ శంకర్ మొదట ఓ బ్రాహ్మణ కుర్రాడి ఉగ్రవాదం గురించి కథ చెప్పాడు. కథ నచ్చక ఇష్టం లేదు. చేయలేను అని చెప్పా. ఆ కథను సినిమాగా తీయాలనుకుంటే కథలో మార్పులు చేయమని సలహా ఇచ్చా’’ అని అన్నారు. మరి, ‘జెంటిల్ మ్యాన్’ను కమల్ హాసన్ రిజెక్ట్ చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : నిర్మాతకు హీరో దర్శన్ బెదిరింపులు! ఆడియో టేపు కలకలం..