సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్కారు వారి పాట’ చిత్ర ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వరుస విజయాల నేపథ్యంలో మహేష్ బాబు నటిస్తున్నచిత్రం కావడంతో ఇప్పటికే దీనిపై అంచనాలు పెరిగిపోయాయి. అయితే.. ఈ చిత్రం షూటింగ్ మొదలైనపుడు కరోనా సెకండ్ వేవ్ ఇబ్బందులు ఎదరుయ్యాయి. కానీ.. అలాంటి ఎన్నో ఇబ్బందులను దాటుకుని “సర్కారు వారి పాట” విడుదలకి సిద్ధమవుతోంది.
ఇక ఇప్పుడు ఈ మూవీ ప్రమోషనల్ వీడియోస్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే కళావతి సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ పాటలో మ్యూజిక్ తో పాటు మహేష్ కూడా చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. మరి ఈ లెక్కన మహేష్ ఫ్యాన్స్ కి ఫిబ్రవరి 14న కళావతి ట్రీట్ అదిరిపోనుందని అర్ధమవుతుంది. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ సాంగ్ లో.. కీర్తిసురేష్ తన గ్లామరస్ లుక్ తో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. థమన్ అందించిన ఈ ట్యూన్ అదిరిపోయే రేంజ్ లో ఉండటంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. మరి.. మీరు కూడా కళావతి సాంగ్ ప్రోమో ఎలా ఉందొ చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.