తెలుగు సినిమా పరిశ్రమలో బాలకృష్ణకు ఉండే క్రేజే వేరు. ఆయన సినిమా కోసం ఎంత మంది ఎదురు చూస్తే.. అప్ డేట్ కోసం కూడా అంతే ఆత్రుత కనబరుస్తారు అభిమానులు. అలాగే ఇటీవల కాలంలో సక్సెస్ బాటలో పరుగెడుతున్న దర్శకుడు అనిల్ రావిపూడి
తెలుగు సినిమా పరిశ్రమలో బాలకృష్ణకు ఉండే క్రేజే వేరు. ఆయన సినిమా కోసం ఎంత మంది ఎదురు చూస్తే.. అప్ డేట్ కోసం కూడా అంతే ఆత్రుత కనబరుస్తారు అభిమానులు. అలాగే ఇటీవల కాలంలో సక్సెస్ బాటలో పరుగెడుతున్న దర్శకుడు అనిల్ రావిపూడి. కామెడీ కమ్ యాక్షన్ సినిమాలను తీయడంలో దిట్టగా మారాడు. ఇప్పటి వరకు ఫెయిల్యూర్ చూడని దర్శకుడు కూడా. ఇప్పుడు బాలయ్యతో తెరకెక్కిస్తున్న సినిమా భగవంత్ కేసరి. ఇందులో హీరోయిన్లుగా కాజల్ అగర్వాల్, శ్రీలీల నటిస్తున్న సంగతి విదితమే. అయితే ఇటీవల అనిల్ రావిపూడి.. సినిమా గురించి వెరైటీగా అప్ డేట్ ఇచ్చారు.
బాలకృష్ణ, విజయశాంతి హీరో హీరోయిన్లుగా వచ్చిన లారీ డ్రైవర్ సినిమాలో బాలయ్య.. బాలయ్య అంటూ సాగే పాటకు అనిల్ రావిపూడి, ఫైట్ మాస్టర్, డ్యాన్స్ మాస్టర్‌తో కలిసి డ్యాన్స్ చేయగా వైరల్ అయిన సంగతి విదితమే. ఇప్పుడు ఈ సినిమా హీరోయిన్లు కాజల్, శ్రీలల రెచ్చిపోయారు. నరసింహ నాయుడు సినిమాలోని చిలకపచ్చ కోక, పెట్టినాది కేక పాటలో మధ్యలో లిరిక్స్‌తో డ్యాన్స్ చేస్తూ ఓ ఊపు ఊపేశారు. ఇద్దరూ ఒకే రకమైన డ్రస్సులు వేసి బాలయ్య సాంగ్ కు దుమ్ము దులిపేశారు. దీన్ని అనిల్ తన ఇన్ స్టాలో పోస్టు చేస్తూ.. బాలకృష్ణ సాంగ్‌కు తాను వేసిన సెప్టులు చూసి ఈర్షపడ్డ తన హీరోయిన్స్ కాజల్, శ్రీలల ఇలా డ్యాన్సులు చేయకుండా ఉండలేకపోయారు అంటూ కామెంట్స్ చేశారు. బాలయ్య బాబు పాటలు అంటే మరి ఆ మాత్రం ఊపు లేకపోతే ఎట్టా అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్ మారింది. దసరా కానుకగా ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి.