కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కబ్జా'. దర్శకుడు ఆర్. చంద్రు ఎంతో ప్రతిస్టాత్మకంగా భావించి తెరకెక్కించిన ఈ సినిమాలో స్టార్ హీరోలు కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ కీలకపాత్రలలో నటించారు. ఉపేంద్ర సరసన శ్రియ హీరోయిన్ గా నటించింది. కాగా.. సినిమాకి కబ్జా అని టైటిల్ తో పాటు ఉపేంద్ర ఫేమ్ కూడా ఫ్యాన్స్ లో అంచనాలు పెరగడానికి బాగా కలిసొచ్చాయి. మరి కబ్జా మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం!
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కబ్జా‘. దర్శకుడు ఆర్. చంద్రు ఎంతో ప్రతిస్టాత్మకంగా భావించి తెరకెక్కించిన ఈ సినిమాలో స్టార్ హీరోలు కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ కీలకపాత్రలలో నటించారు. ఉపేంద్ర సరసన శ్రియ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాని ఆనంద్ పండిట్, అలంకార్ పాండ్యన్ సంయుక్తంగా నిర్మించారు. కాగా.. సినిమాకి కబ్జా అని టైటిల్ తో పాటు ఉపేంద్ర ఫేమ్ కూడా ఫ్యాన్స్ లో అంచనాలు పెరగడానికి బాగా కలిసొచ్చాయి. కానీ.. రిలీజ్ సమయానికి సాంగ్స్, ట్రైలర్ లలో కేజీఎఫ్ పోలికలు కనిపించేసరికి.. ప్రేక్షకులలో కావాల్సిన బజ్ అయితే క్రియేట్ కాలేదు.
ఎట్టకేలకు మార్చి 17న కబ్జా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యింది. కానీ.. విడుదలైన మొదటి షో నుండే ఆడియెన్స్ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయిందని తెలుస్తోంది. పైగా కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రుర్ ఈ సినిమాకి వర్క్ చేశాడు. అయినా కబ్జా కథాకథనాలలో బలం లేకపోవడంతో రవి మ్యూజిక్ కూడా బయటికి రాలేదు. అయితే.. మొదటి షో నుండే ఉపేంద్ర సినిమాకి నెగిటివ్ టాక్ రావడం.. కలెక్షన్స్ పై భారీ ప్రభావం చూపింది. కాగా.. కబ్జా మూవీకి వరల్డ్ వైడ్ రూ. 45 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అంచనాలు రీచ్ కాకపోవడంతో సినిమాకి ఓపెనింగ్స్ లోనే పెద్ద దెబ్బ పడింది.
ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా.. సినిమాలో ఎంతమంది స్టార్స్ ఉన్నా.. కథాకథనాలు బాగుండి, పాజిటివ్ టాక్ వస్తేనే జనాలు థియేటర్స్ కి వెళ్తున్నారు. అలాంటిది కబ్జా సినిమా విషయంలో ఉపేంద్రతో పాటు సుదీప్, శివరాజ్ కుమార్ ఉండి కూడా లాభం లేకుండా పోయిందట. కబ్జా ఫస్ట్ డే కలెక్షన్స్ చూసినట్లయితే.. తెలుగులో రూ. 1.45 కోట్లు గ్రాస్, రూ. 65 లక్షలు షేర్ రాబట్టగా.. తెలుగు రాష్ట్రాలలో రూ. 3 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుందట. ఆ లెక్కన ఇంకా రూ. 2.35 కోట్లు షేర్ రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ చూసుకుంటే రూ. 26 కోట్లు వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి కబ్జా సినిమా పూర్తి స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. సో.. ఇంకా బాక్సాఫీస్ వద్ద 35 కోట్లకు పైగా రాబట్టాల్సి ఉంది. మరి కబ్జా సినిమా కలెక్షన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#Kabzaa Day 1 Box Office Collection is 26cr 🔥🔥
Source : Official from Director @rchandru_movies pic.twitter.com/rdd7i760to
— Naveen Kumar (@naveen_10_) March 18, 2023