కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కబ్జా'. దర్శకుడు ఆర్. చంద్రు ఎంతో ప్రతిస్టాత్మకంగా భావించి తెరకెక్కించిన ఈ సినిమాలో స్టార్ హీరోలు కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ కీలకపాత్రలలో నటించారు. ఉపేంద్ర సరసన శ్రియ హీరోయిన్ గా నటించింది. కాగా.. సినిమాకి కబ్జా అని టైటిల్ తో పాటు ఉపేంద్ర ఫేమ్ కూడా ఫ్యాన్స్ లో అంచనాలు పెరగడానికి బాగా కలిసొచ్చాయి. మరి కబ్జా మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం!
ఉపేంద్ర గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోగా, నటుడిగా, అంతకు మించి దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన మేనరిజంని సెట్ చేసుకున్నారు. ఆలోచింపజేసే సినిమాలను తీయడంలో ఉపేంద్ర దిట్ట. అయితే ఆయన ప్రస్తుతం నటుడిగానే కొనసాగుతున్నారు. కన్నడలో హీరోగా చేస్తూనే.. అవకాశం ఉన్నప్పుడల్లా తెలుగులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఆయన హీరోగా నటించిన కబ్జా మార్చి 17న విడుదలైంది. అయితే ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు చాలా మందికి కేజీఎఫ్ సినిమాని ఆదర్శంగా తీసుకున్నారేమో అన్న ఫీలింగ్ కలిగింది. ట్రైలర్ చూడగానే కేజీఎఫ్ వైబ్స్ రావడం, దానికి తోడు కన్నడ నుంచి ఉపేంద్ర హీరోగా సినిమా వస్తుండడంతో కబ్జా మీద అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, కిచ్చ సుదీప్ లు కలిసి నటిస్తున్న భారీ చిత్రం కబ్జా. ఈ చిత్ర ఆడియో వేడుకలను భారీగా ప్లాన్ చేశారు మేకర్స్. ఇక ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు మేకర్స్.