కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, కిచ్చ సుదీప్ లు కలిసి నటిస్తున్న భారీ చిత్రం కబ్జా. ఈ చిత్ర ఆడియో వేడుకలను భారీగా ప్లాన్ చేశారు మేకర్స్. ఇక ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు మేకర్స్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఓ వైపు క్రియాశీల రాజకీయాలతో పాటు మరోవైపు సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. చేతినిండా సినిమాలతో షూటింగ్ లు చేస్తూ.. బిజీబిజీగా గడుపుతున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ సినిమా వేడుకులకు ఎక్కువగా హాజరు కారు అన్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు రాజకీయాలతో బిజీ కావడంతో చాలా ఫంక్షన్స్ కు వెళ్లడం లేదు. ఈ క్రమంలోనే కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రకు క్షమాపణలు చెప్పాడు పవన్ కళ్యాణ్.
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, కిచ్చ సుదీప్ లు కలిసి నటిస్తున్న భారీ చిత్రం కబ్జా. ఈ మూవీని కన్నడతో పాటుగా పలు భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందులో భాగంగానే తెలుగులో కూడా మూవీని రిలీజ్ చేయబోతున్నారు. దాంతో తెలుగు ఆడియన్స్ టార్గెట్ చేశారు మేకర్స్. దాని కోసం ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఆడియో ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా ఆహ్వానించారు కబ్జా టీమ్. అయితే తాను ఈ ఫంక్షన్ కు రాలేకపోతున్నందుకు బాధపడుతున్నాను అని ఓ ప్రెస్ నోట్ ద్వారా తెలిపాడు పవన్ కళ్యణ్. ఆ ప్రకటనలో ఈ విధంగా రాసుకొచ్చాడు పవర్ స్టార్..
“నన్ను కబ్జా టీమ్ ఆడియో రిలీజ్ కు ముఖ్య అతిథిగా పిలిచినందుకు టీమ్ అందరికి ధన్యవాదాలు. అయితే ముందుగా అనుకున్న కార్యక్రమాల దృష్ట్యా నేను ఈ ఫంక్షన్ కు రాలేకపోతున్నాను అందుకు నేను బాధపడుతున్నాను. పొలిటికల్ మీటింగ్స్ తో బిజీగా ఉన్నందున వేడుకకు రావట్లేదు. ఇక హీరోలు ఉపేంద్ర, సుదీప్ లకు నా ప్రత్యేక శుభాకాంక్షలు. కబ్జా సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని ఆ ప్రకటనలో రాసుకొచ్చారు పవర్ స్టార్. ఇక కబ్జ మూవీలో శ్రియాశరణ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ముఖ్య పాత్రల్లో పోసాని కృష్ణ మురళీ, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు. ఇక కబ్జ సినిమాను చంద్రు డైరెక్ట్ చేస్తూ.. స్వయంగా నిర్మిస్తున్నారు.
As Hero @PawanKalyan garu couldn’t make it to the Audio Launch of #Kabzaa he conveys his regrets & sends his best wishes for the entire team of #Kabzaa@nimmaupendra @KicchaSudeep @rchandru_movies @anandpandit63 @apmpictures @RaviBasrur @TanyaHope_offl#KabzaaFromMarch17 pic.twitter.com/OMl59l9otE
— Vamsi Kaka (@vamsikaka) March 1, 2023