టాలీవుడ్లో రీ–రిలీజ్ ట్రెండ్ ఊపందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్టార్ హీరోల పలు చిత్రాలు మళ్లీ విడుదలై అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో మరో మూవీ రీ–రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ జోష్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ త్వరలో కొత్త చిత్రం మొదలుపెట్టనున్నారు. జక్కన్న మూవీ తర్వాత తారక్‌కు బాగానే గ్యాప్ వచ్చింది. ఆయనతో ‘ఆర్ఆర్ఆర్’లో కలసి నటించిన రామ్ చరణ్ వరుసగా ప్రాజెక్టులను చేసుకుంటూ పోతున్నాడు. చెర్రీతో శంకర్ తీస్తున్న మూవీ షూటింగ్ సగానికి పైగా పూర్తయిందని తెలుస్తోంది. త్వరలో హాలీవుడ్ ఎంట్రీకి సంబంధించిన న్యూస్‌ను కూడా చెబుతానని చరణ్ అంటున్నాడు. హాలీవుడ్ స్టూడియోలతో చర్చలు జరుగుతున్నాయని రివీల్ చేశాడు. మరోవైపు తారక్ మాత్రం లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఎట్టకేలకు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘ఎన్టీఆర్ 30’ రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే మొదలుకానుంది.
ఇదిలాఉండగా.. టాలీవుడ్లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల హిట్ సినిమాలను మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ‘ఖుషి’, ‘జల్సా’, మహేశ్ బాబు ‘పోకిరి’, వెంకటేశ్ ‘నారప్ప’, బాలకృష్ణ ‘చెన్నకేశవ రెడ్డి’ తదితర చిత్రాలు రీ–రిలీజ్ అయి అభిమానులకు మంచి థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చాయి. ఈ క్రమంలో మరో స్టార్ హీరో మూవీ రీరిలీజ్ కాబోతోందని తెలుస్తోంది. అదే ‘ఆంధ్రావాలా’. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో ‘నాయ్రే నాయ్రే’ పాటకు తారక్ వేసిన స్టెప్పులు అదుర్స్ అనే చెప్పాలి. ఈ ఫిల్మ్ ఆడియో లాంఛ్‌కు అప్పట్లో 5 లక్షలకు పైగా జనాలు రావడం సంచలనం సృష్టించింది.
ఇప్పటివరకు జరిగిన ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, సక్సెస్ మీట్లు తదితరాల్లో అత్యధిక మంది ప్రేక్షకులు హాజరైన కార్యక్రమంగా ‘ఆంధ్రావాలా’ ఆడియో ఈవెంట్‌ను చెబుతుంటారు. ‘సింహాద్రి’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం ద్వారా రిలీజ్ కావడం, సక్సెస్ఫుల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించడంతో ‘ఆంధ్రావాలా’పై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. కానీ సినిమా మాత్రం అందుకు తగ్గట్లుగా లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద పరాజయం తప్పలేదు. అయితే ఇందులో తారక్ యాక్టింగ్ మాత్రం అందర్నీ అలరించింది. ఈ నెలలోనే విడుదల కాబోతోందని చెబుతున్న ఈ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. మరి.. ‘ఆంధ్రావాలా’ను మళ్లీ థియేటర్లలో చూసేందుకు మీరు ఎంతగా ఎదురు చూస్తున్నారనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Young Tiger #NTR‘s & Dashing Director #PuriJagannath‘s #Andhrawala Re-Releasing this Month.. pic.twitter.com/q861Nylyjp
— Fukkard (@Fukkard) March 9, 2023