ఆస్కార్ వేడుక వైభవంగా జరిగింది. ప్రతి ఏటా మనకు ఒక్క ఆస్కార్ అయినా రాదా అని భారతీయులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూసేవారు. అలాంటి వారికి డబుల్ ధమాకా ఇస్తూ ఈసారి మనకు ఏకంగా రెండు పురస్కారాలు వచ్చాయి. ఇక, ఆస్కార్ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన సరదా కామెంట్స్ వైరల్‌గా మారాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..!
సినిమాలకు సంబంధించి ప్రపంచంలోనే అత్యుత్తమ పురస్కారాలుగా చెప్పుకునే ‘ఆస్కార్’ వేడుక వైభవంగా సాగింది. హాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు ఈ సంవత్సరం ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ కూడా ఈ గ్రాండ్ ఈవెంట్లో సందడి చేసింది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన ఈ వేడుకల్లో ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ చిత్రం ఏకంగా ఏడు పురస్కారాలను అందుకుని విజయకేతనం ఎగురవేసింది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి అవార్డులు ఆ మూవీనే వరించాయి. ఈసారి ఆస్కార్స్‌లో భారత జెండా రెపరెపలాడింది. మన దేశానికి రెండు పురస్కారాలు దక్కాయి. ఇండియా నుంచి నామినేట్ అయిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు దక్కింది.
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీ నుంచి ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ అవార్డును సొంతం చేసుకుంది. దీంతో యావత్ భారత్ గర్వంతో ఉప్పొంగిపోతోంది. ఇదిలాఉండగా.. ఆస్కార్ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ అందర్నీ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఆయన ధరించిన డ్రెస్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. దానిపై ఉన్న పులి బొమ్మ గురించి ఆస్కార్ వేడుకలో ఓ రిపోర్టర్ తారక్‌ను అడిగారు. దీనికి ఆయన తనదైన శైలిలో స్పందించారు. భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా తాను ఈ వస్త్రధారణలో వచ్చానన్నారు. ‘ఆర్ఆర్ఆర్’లో తనతో కలసి దూకిన పులి ఇదేనంటూ సరదాగా చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
India walks the red carpet at The Oscars with NTR @tarak9999 #Oscars #Oscars95 #RRRMovie pic.twitter.com/jVgTsPCznk
— …. (@ynakg2) March 13, 2023