సినీ ఇండస్ట్రీలో స్టార్స్ గా కొనసాగుతున్న అభిమాన హీరోల గురించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఫేవరేట్ హీరోల ఫ్యామిలీ, పిల్లలకు సంబంధించిన విషయాలను ఆత్రంగా ఆరా తీస్తుంటారు అభిమానులు. అయితే.. టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి, ఆయన ఫ్యామిలీ గురించి అన్ని నందమూరి ఫ్యాన్స్ కి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు.
ఇక ఎన్టీఆర్ ఫ్యామిలీ, పిల్లలు అభయ్, భార్గవ్ లు అందరికీ తెలుసు. సాధారణంగా సినీ హీరోల పిల్లలు ఊహ తెలిసాక మీ ఫేవరేట్ హీరో ఎవరంటే.. ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళ డాడీ పేరే చెబుతుంటారు. కానీ కొందరు పిల్లలు మాత్రం ఫ్యామిలీకి చెందిన హీరోలను కాకుండా వేరే హీరోలను అభిమానిస్తుంటారు. తాజాగా తన పెద్ద కొడుకు అభయ్ కి ఏ హీరో అంటే ఇష్టమనే విషయాన్నీ ఇంటర్వ్యూలో బయట పెట్టాడు ఎన్టీఆర్.
ఈ క్రమంలో ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్ అభిమానించే హీరో ఎవరో కాదు. సూపర్ స్టార్ మహేష్ బాబు. అందులోనూ మహేష్ నటించిన సినిమాలలో అభయ్ కి ‘బిజినెస్ మ్యాన్’ మూవీ చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. ఇండస్ట్రీలో ఎన్టీఆర్ – మహేష్ రిలేషన్ గురించి అందరికి తెలుసు. ఎన్టీఆర్ మహేష్ ని ‘అన్న’ అని పిలుస్తుంటాడు. మహేష్ కూడా తారక్ తమ్ముడు అంటుంటాడు. ఇప్పుడు అభయ్ కి అభిమాన హీరో మహేష్ అని తెలిసేసరికి ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.