దివంగత నటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు వర్ధంతి రోజున ప్రతి ఏడాది నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తుంటారు. ఈసారి 27వ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నందమూరి వారసులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో పాటు బాలకృష్ణ నెక్లెస్ రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు ప్రకటించారు. బుధవారం ఉదయం తారక్, కళ్యాణ్ రామ్ లు ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి.. పుష్పగుచ్చం అందించి నివాళి అర్పించారు. వీరితో పాటు బాలయ్య, సుహాసిని కూడా ఎన్టీఆర్ ఘాట్ ని సందర్శించారు.
ప్రస్తుతం వీరికి సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో బాలయ్య మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కుమారుడిగా జన్మించడం తన పూర్వజన్మ సుకృతమని, తెలుగు జాతి ఉన్నంతవరకు ఎన్టీఆర్ ను ఎవ్వరూ మరిచిపోరని చెప్పారు. ఇదిలా ఉండగా.. ప్రెజెంట్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుండి బాలయ్య, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ముగ్గురు వరుస హిట్స్ తో దూసుకుపోతున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న తారక్.. తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతుంది.
మరోవైపు గతేడాది బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కళ్యాణ్ రామ్.. నెక్స్ట్ డెవిల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఆ తర్వాత బింబిసార సీక్వెల్ మూవీ కూడా చేయబోతున్నాడు. ఇక నటసింహం బాలయ్య.. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత గోపీచంద్ మలినేనితో ‘వీరసింహారెడ్డి’ మూవీ చేశాడు. ఇటీవల విడుదలైన ఆ సినిమా.. మాస్ ఎంటర్టైనర్ గా థియేటర్స్ లో విజయవంతంగా రన్ అవుతోంది. తదుపరి సినిమాని అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేయనున్నాడు. అయితే.. సినిమాలే కాకుండా అన్ స్టాపబుల్ షోతో ఆల్ ఇండియా వైడ్ క్రేజ్ సంపాదించుకున్నాడు బాలయ్య.
~ @tarak9999 anna & @NANDAMURIKALYAN anna paid their tributes to Sr NTR garu at NTR ghat #JoharNTR pic.twitter.com/lBaVyAHrCa
— Team Nandamuri Kalyan ram (@TeamKalyanram) January 18, 2023
Young tiger @tarak9999 and @NANDAMURIKALYAN visited NTR Ghat to pay respects to their Grandfather Legendary #SrNTR Garu!!💐🙏#RememberingNTR #JrNTR #KalyanRam #TeluguFilmNagar pic.twitter.com/jhKEhJMZrJ
— Telugu FilmNagar (@telugufilmnagar) January 18, 2023