సినీ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు స్టార్ హీరోలు వారి దైవభక్తికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. స్టార్ హీరోలను అలా చూస్తూ ఫ్యాన్స్ కూడా హ్యాపీ అవుతుంటారు. మామూలు జనాలతో పాటు సెలబ్రిటీలు సైతం దీక్షలు వేస్తూ ఉంటారు. అయితే.. ఎక్కువగా మనం హీరోలు కూడా అయ్యప్ప స్వామి దీక్ష వేసుకోవడం చూస్తుంటాం.
తెలుగుతో పాటు వేరే ఇండస్ట్రీలకు చెందిన హీరోలు చాలామంది అయ్యప్ప మాల ప్రతి సంవత్సరం వేసుకుంటారు. చిరంజీవి, రామ్ చరణ్, శర్వానంద్, మురళీ మోహన్, రాజేంద్రప్రసాద్, ధనుష్, శింబు, వివేక్ ఒబెరాయ్, అజయ్ దేవగణ్.. ఇలా ప్రముఖులు ఉన్నారు. కొంతమంది శివ మాల, వేంకటేశ్వరస్వామి మాల, ఆంజనేయస్వామి మాల కూడా వేసుకుంటారు.
ఇక హీరోలు మాలలో ఉన్నప్పుడు ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ తర్వాత సక్సెస్ పార్టీలో తప్ప యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బయట ఎక్కడా కనపడలేదు. తాజాగా ఎన్టీఆర్ మాలలో ఉన్న ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. ఇటీవలే ఆయన ఆంజనేయస్వామి మాల ధరించారు. దీంతో ఎన్టీఆర్ ఫోటో తెగవైరల్ అవుతోంది. అయితే.. గతంలో ఎన్టీఆర్ ఎప్పుడూ మాల ధరించిన దాఖలాలు లేవు. కాబట్టి ఎన్టీఆర్ ని మాలలో చూసి ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ లేటెస్ట్ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.