దేశవ్యాప్తంగా ఇప్పుడు ట్రిపులార్ ఫీవర్ నడుస్తోంది. ఆ సినిమాలో రాంచరణ్– ఎన్టీఆర్ నటన గురించే కాదు.. వారి మధ్య ఉన్న బంధం గురించి కూడా అంతా మాట్లాడుకుంటున్నారు. ట్రిపులార్ సినిమా మొదలైనప్పటి నుంచి చెర్రీ- తారక్ ల స్నేహాన్ని చూసి యావత్ సినీరంగం ముచ్చటపడిపోయింది. అయితే ఇదంతా సినిమా వరకే ఉంటుందేమో అని అభిమానులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే వారి స్నేహం ఆ ఒక్క సినిమాతో ఆగిపోదని తాజాగా ఎన్టీఆర్ నిరూపించాడు. అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ విడుదల చేసిన లేఖలో కూడా రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు.
ఇదీ చదవండి: ఐదో రోజు తగ్గేదేలే.. ఆల్ టైమ్ రికార్డు సెట్ చేసిన RRR!
‘రామ్ చరణ్ లేకుండా నేను ట్రిపులార్ సినిమాని ఊహించుకోలేను. చరణ్ కాకుండా మరెవరూ సీతారామరాజు పాత్రకు న్యాయం చేయలేరు. ఒక్క ట్రిపులార్ సినిమానే కాదు.. నువ్వు లేకుండా నేను చేసిన భీమ్ పాత్ర కూడా సంపూర్ణం కాదు’ అంటూ తారక్ చెప్పిన మాటలు చూసి అభిమానులు ఎంతో సంబరపడిపోయారు. ఆ మాటల్లోనే వారి మధ్య ఉన్న బంధం ఎలాంటిదో అర్థమైపోతుంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా ట్రిపులార్ సినిమా గురించి మాట్లాడుతూ ముందుగా ఎన్టీఆర్ గురించి ప్రస్తావిచడం చూశాం. ఈ పరిణామాలు చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ మెగా హీరోగా మారిపోయాడనే చెప్పాలి.అటు మెగా ఫ్యాన్స్ సైతం ఎన్టీఆర్ ని పాన్ ఇండియా స్టార్ గానే కాకుండా.. మెగా హీరోగా భావిస్తూ సపోర్ట్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో మొదటి నుంచి మెగా ఫ్యామిలీ- నందమూరి కుటుంబాల మధ్య కనిపించని కోల్డ్ వార్ నడిచిన విషయం తెలిసిందే. అయితే ఈ యంగ్ జనరేషన్ ఆ కోల్డ్ వార్ కు శుభంకార్డు వేశారనే చెప్పాలి. వారి మధ్య స్నేహం తప్పకుండా టాలీవుడ్ లో ఒక మంచి వాతావరణాన్ని సృష్టిస్తుంది అని చెప్పచ్చు. రాంచరణ్- జూనియర్ ఎన్టీఆర్ ల స్నేహంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
I’m touched beyond words… pic.twitter.com/PIpmJCxTly
— Jr NTR (@tarak9999) March 29, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.