అలనాటి అందాలతార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. టాలీవుడ్ ఎంట్రీ కోసం చాలాకాలంగా ఎదురు చూస్తోంది. మొత్తానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన 'NTR30'లో అవకాశం దక్కించుకుంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కనున్న ఈ సినిమా నుండి రీసెంట్ గా మేకర్స్ జాన్వీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి కిక్కిచ్చారు. కానీ.. ఎన్టీఆర్ సినిమాకి ముందే జాన్వీ.. తెలుగు హీరోల ప్రాజెక్ట్ లో నటించిందని ఎంతమందికి తెలుసు.
అలనాటి అందాలతార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. టాలీవుడ్ ఎంట్రీ కోసం చాలాకాలంగా ఎదురు చూస్తోంది. మొత్తానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన ‘NTR30’లో అవకాశం దక్కించుకుంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కనున్న ఈ సినిమా నుండి రీసెంట్ గా మేకర్స్ జాన్వీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి కిక్కిచ్చారు. జనతా గ్యారేజ్ తర్వాత దర్శకుడు కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా వచ్చే ఏడాది.. అంటే 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు కొద్దిరోజుల క్రితమే ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ అంతా ఎంతో ఎక్సయిటింగ్ గా వెయిట్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. బాలీవుడ్ దాదాపు ఐదు సినిమాలకు పైగా నటించిన జాన్వీ.. తెలుగులో ఎన్టీఆర్30తో డెబ్యూ చేయనుంది. కానీ.. ఎన్టీఆర్ సినిమాకి ముందే జాన్వీ.. తెలుగు హీరోల ప్రాజెక్ట్ లో నటించిందని ఎంతమందికి తెలుసు. ప్రస్తుతం.. జాన్వీ తెలుగు హీరోల ప్రాజెక్ట్ లో నటించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్30 కన్నా ముందే జాన్వీ.. స్టార్ హీరోలు విక్టరీ వెంకటేష్ – రానా కాంబినేషన్ లో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’లో నటించింది. తాజాగా రానా నాయుడు సిరీస్ ని ప్రొడ్యూస్ చేసిన నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు జాన్వీ కనిపించే సీన్ ప్రోమోని రిలీజ్ చేసి సర్ప్రైజ్ చేశారు.
ఇక మార్చి 6న జాన్వీ పుట్టినరోజు కావడంతో.. అటు ఎన్టీఆర్30 నుండి, ఇటు రానా నాయుడు నుండి మేకర్స్ ఇలా అప్ డేట్స్ తో ఫ్యాన్స్ ని మెప్పించారు. మార్చి 10 నుండి రానా నాయుడు వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ని కూడా పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషలలో ఒకేసారి స్ట్రీమ్ చేయనున్నారు. అయితే.. ఈ సిరీస్ లో రానా బాలీవుడ్ సెలబ్రిటీలకు ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా ఆదుకునే పాత్రలో నటించాడు. తాజాగా జాన్వీ పుట్టిన రోజు కావడంతో.. ప్రాబ్లెమ్ లో ఉన్న జాన్వీని రానా వచ్చి కాపాడినట్లుగా ప్రోమోలో చూపించారు. ప్రోమో చూస్తుంటే ఫన్ గానే ఉంది. మరి ఈ వీడియో ప్రమోషన్స్ కోసం చేశారా? లేక నిజంగానే జాన్వీ సిరీస్ లో ఉందా? అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి జాన్వీ కపూర్ తెలుగు డెబ్యూపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.