ఎంత పెద్ద దర్శకుడు అయినా కూడా కెరీర్‌లో ఓ కలల ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. తాను సినిమాల నుంచి రిటైర్ అయ్యేలోపు అలాంటి సినిమా చేసేయాలనుకుంటారు కొందరు దర్శకులు. రాజమౌళికి ‘మహాభారతం‘ అలాంటి ఓ కల. తాను ఎన్ని సినిమాలు చేసినా కూడా అది కేవలం మహా భారతం చేయడానికి ప్రాక్టీస్ మాత్రమే అని చెప్తుంటాడు రాజమౌళి. అలా తెలుగులో మరో దర్శకుడికి కూడా ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. ఆయనే పూరీ జగన్నాథ్. ఈ సెన్సేషనల్ డైరెక్టర్‌కు ఓ సినిమా చేయాలని ఎప్పట్నుంచో కోరిక. అదే జన గణ మన. ఈ సినిమాతో దేశానికి ఏదో చెప్పాలని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాడు పూరీ.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, కాంబినేషన్ లో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘లైగర్’ . ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. దీనిని ఈ ఏడాది ఆగస్టు 25న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. లైగర్ షూటింగ్ కంప్లీట్ చేసి రిలాక్స్ మోడ్ లో ఉన్నాడు విజయ్ దేవరకొండ. లైగర్ కోసం గత ఏడాదిన్నరగా.. హెయిర్ స్టయిల్ పెంచేసి.. సిక్స్ ప్యాక్ బాడీ తో కనిపించిన విజయ్ లుక్ పూర్తిగా చేంజ్ చేసాడు. గుండు చేయించుకుని క్యాప్ పెట్టుకుని తిరుగుతున్నాడు. సడన్ గా విజయ్ ఎందుకిలా మారిపోయాడంటారా?. విజయ్ తన నెక్స్ట్ సినిమాలో ఒక సోల్జర్ గా కనిపించనున్నాడు అందుకే ఈ లుక్.
ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ సరసన ఆలియా భట్?పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ మూవీ. చేసిన విజయ్ దేవరకొండ తన తదుపరి మూవీ కూడా పూరి దర్శకత్వంలోనే చేస్తున్నాడు. అదే పూరి డ్రీం ప్రాజెక్ట్ జన గణ మన. మహేష్ లాంటి స్టార్స్ రిజెక్ట్ చేసిన ఈ జన గణ మన స్క్రిప్ట్ కి విజయ్ దేవరకొండ ఓకె చెప్పడంతో.. పూరీ ఇమ్మిడియట్ గా రంగంలోకి దిగిపోయి సినిమాని మొదలు పెట్టేశారు. జనగణమన (జేజీఎమ్) అనే టైటిల్ తో రూపుదిద్దుకోబోయే ఈ చిత్రం నేడు ఓపెనింగ్ జరుపుకుంది. పూరీ కనెక్ట్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నిర్మాణం జరుపుకోనుంది. ముంబయిలో ఈ చిత్రం ప్రారంభం కోసం హీరో విజయ్ దేవరకొండ హెలికాప్టర్ లో రాగా, అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న ఆర్మీ కమాండో వాహనంలో ఎక్కి అందరికీ అభివాదం చేశాడు.
#VijayDevarakonda makes dashing entry at #JanaGanaMana launch in mumbai@ArtistryBuzz @TheDeverakonda #vijaydeverkonda pic.twitter.com/wBaNEZJVIZ
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) March 29, 2022
Boss on duty 🔥🔥🔥#janaganamana #VijayDevarakonda#PuriJagannadh pic.twitter.com/lqc2nkw5Ei
— SIVA DEVARAKONDA 💥 TOOFAN (@Darling57174528) March 29, 2022
ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమంలో విజయ్ దేవరకొండతో పాటు పూరీ జగన్నాథ్, చార్మీ, వంశీ పైడిపల్లి తదితరులు పాల్గొన్నారు. పూరీ జగన్నాథ్ జనగణమన కథను గతంలోనే మహేశ్ బాబుతో తీయాలని కోరుకున్నట్టు తెలుస్తోంది. ఆ ప్రాజెక్టు ఫైనల్ కాకపోవడంతో, ఇప్పుడు విజయ్ దేవరకొండతో తీస్తున్నట్టు సమాచారం. కాగా ఈ చిత్ర నిర్మాణంలో టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా పాలుపంచుకుంటున్నాడు. మైహోమ్ సంస్థ సినిమా నిర్మాణ బ్యానర్ శ్రీకర స్టూడియోస్ తరఫున వంశీ పైడిపల్లి జనగణమన సినిమా ఓపెనింగ్ కు హాజరయ్యాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఇవాళే ఎనౌన్స్ చేశారు. 2023 ఆగస్టు 3న ప్రేక్షకుల ముందుకు వస్తుందని వెల్లడించారు.
Vamshi Paidipally turning as producer
He along with Puri Connects produce the film, #JanaGanaMana, Massive action drama, which is being made in Five Indian languages. #JGM #VD pic.twitter.com/HYuFxMK0X3
— Aakashavaani (@TheAakashavaani) March 29, 2022
ఈ పాన్ ఇండియా క్రేజీ ప్రాజెక్ట్ తెలుగు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో రూపుదిద్దుకోనుంది. ఇది ప్రధానంగా సైనిక నేపథ్యంలో వచ్చే సినిమా అని తెలుస్తోంది. త్వరలోనే ఈ భారీ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.
One your best looks @TheDeverakonda as always looking so handsome 😍🤎#VijayDeverakonda #JanaGanaMana pic.twitter.com/3JrlIK6j35
— Vidya⁷ (@Vidyaaaaa7) March 29, 2022
Vijay Deverakonda’s back to back films with Puri Jagannadh #Liger #JanaGanaMana pic.twitter.com/44PjtyOhUK
— MIRCHI9 (@Mirchi9) March 28, 2022
ఇది కూడా చదవండి: అల్లు అరవింద్ కుమారుడికే ఏపీ ఆన్ లైన్ టికెట్ కాంట్రాక్ట్!