ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వాస్తవిక ఆధారాలతో రూపొందించిన చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఈ నేపథ్యంలో తా.సే.జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య హీరోగా వాస్తవిక ఆధారంగా రూపొందించిన చిత్రం ‘జై భీమ్’. మాస్ పాత్రల్లోనే కాదు, అప్పుడప్పుడు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తారు నటుడు సూర్య. అలా ఆయన నటించి, నిర్మించిన చిత్రం ‘జై భీమ్’. దేశ వ్యాప్తంగా ఈ చిత్రానికి మంచి గుర్తింపు రావడమే కాదు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా లభించాయి. కాకపోతే కొన్ని వర్గాల నుంచి మాత్రం ఈ చిత్రం పై విమర్శలు వచ్చాయి. ఏది ఏమైనా గతేడాది నవంబరులో ఓటీటీలో విడుదలైన ఈ చిత్రంపై సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.
ఇది చదవండి : తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ ధ్రువ తార మీరే తాత : జూ.ఎన్టీఆర్
ఇక జై భీమ్ వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న ఓ కోర్టు డ్రామా కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. తాజాగా ‘జై భీమ్’ చిత్రం ఓ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. అకాడమీ(ఆస్కార్) అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ఈ సినిమాకు సంబంధించిన వీడియోను ఉంచారు. అకాడమీ యూట్యూబ్ వేదికగా ఒక తమిళ సినిమాకు సంబంధించిన వీడియోను ఉంచటం ఇదే తొలిసారి. జస్టిస్ చంద్రు జీవితకథ ఆధారంగా ‘జై భీమ్’ను తెరకెక్కించారు. భారతీయ చిత్రానికి ఇంత గొప్ప గౌరవం లభించడంపై చిత్ర బృందంతో పాటు, సూర్య అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘జై భీమ్’ ఇండియన్ సినిమా స్థాయి మరో మెట్టు ఎక్కించిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.