సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే రోజూవారీ ప్రమాదాలు జరుగుతుంటాయి. షూటింగ్ లో కావొచ్చు, బయటకావొచ్చు తీవ్రంగా గాయపడుతూ ఉంటారు. హీరోహీరోయిన్ల దగ్గర నుంచి డైరెక్టర్స్ వరకు ఇందులో మినహాయింపు ఏం ఉండదు. తాజాగా అలాంటిదే.. ‘గురు’, ‘ఆకాశమే హద్దురా’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మహిళా దర్శకురాలు సుధా కొంగర విషయంలో జరిగినట్లు కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేయడంతో ఈ విషయం కాస్త బయటకొచ్చింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రాలోనే పుట్టిన సుధా కొంగర మణిరత్నం దగ్గర సహాయ దర్శకురాలిగా పనిచేసింది. ఇక ‘సాలా ఖాదుస్’ సినిమాతో డైరెక్టర్ గా మారింది. ఇదే సినిమాను తెలుగులో ‘గురు’ పేరుతో వెంకటేశ్ హీరోగా రీమేక్ చేశారు. అలా తెలుగులోనూ తొలి మూవీతోనే హిట్ కొట్టింది. ఇక సూర్య హీరోగా తీసిన ‘ఆకాశమే హద్దురా’ మూవీ అయితే ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. ఇలా తీసినవి తక్కువ సినిమాలే అయినా సరే డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సుధా.
ప్రస్తుతం ‘ఆకాశమే హద్దురా’ మూవీని హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా తీస్తున్నారు. షూటింగ్ జరుగుతుంది. ఇలా అంతా బాగానే ఉందనుకునే టైంలో తన ప్రమాదం జరిగినట్లు డైరెక్టర్ సుధా కొంగర ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ‘ఎంతో బాధగా ఉంది. చిరాకు పెట్టేస్తోంది. నెలరోజుల పాటు ఈ రెస్ట్ తప్పదు’ అని క్యాప్షన్ పెట్టుకొచ్చింది. అయితే ఈ ప్రమాదం ఎప్పుడు ఎలా జరిగింది అనే విషయాల్ని మాత్రం సుధా కొంగర వెల్లడించలేదు. బహుశా షూటింగ్ లో జరిగి ఉండొచ్చనిపిస్తోంది. మరి సుధా కొంగరకు ప్రమాదం జరిగి తీవ్రగాయాలు కావడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.