ఒకప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు తీయాలంటే బాలీవుడ్ పేరు చెప్పుకునే వాళ్లు. కానీ బహుబలి తర్వాత ట్రెండ్ మారిపోయింది. టాలీవుడ్ వైపు బాలీవుడే కాదూ హలీవుడ్ కూడా చూసేలా చేసిన చిత్రం ఆర్ఆర్ఆర్. మల్టీస్టారర్స్‌తో, భారీ కాస్టింగ్.. బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం భారీగా వసూళ్లు చేసి.. ఆస్కార్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో టాలీవుడ్ మేకర్స్‌పై భారీ అంచనాలు పెరిగాయి. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండీల్ వుడ్ అగ్ర నటులు టాలీవుడ్ నటులతో తెర పంచుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. అందుకు ఉదాహరణ.. గాడ్ ఫాదర్‌లో చిరంజీవితో సల్మాన్ ఖాన్ తెర పంచుకోగా, రాబోయే సలార్ లో ప్రభాస్‌తో మలయాళ నటుడు పృథ్వీరాజ్ కుమారన్ నటించబోతున్నారు. ఇప్పుడు మరో భారీ బడ్జెట్ తో, క్రేజీ కాంబోలో ప్రాజెక్టు తెరకెక్కపోతున్నట్లు సమాచారం.
సీతారామంతో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న హను రాఘపూడి, భారీ బడ్జెట్ తో మల్లీస్టారర్ మూవీకి ప్లాన్ చేసుకుంటున్నారట. అందుకు కోలీవుడ్ నటుడు సూర్యతో సంప్రదింపులు జరుపుతున్నారట. తాజాగా ఫైనల్ వర్షన్ స్టోరీని సూర్యకు చెప్పగా ఆయన చేసేందుకు అంగీకరించారట. అయితే ఇందులో కీ రోల్ కోసం ఎవరితో చేయించాలని డిస్కషన్ జరగ్గా.. రామ్ చరణ్ అయితే బాగుంటుందని హను రాఘవపూడికి సూచించారట సూర్య. ఒకసారి చరణ్ ను కలిసి స్టోరీని డిస్కస్ చేయాల్సిందిగా పేర్కొన్నారట. గతంతో రామ్ చరణ్ తో హను రాఘవపూడి సినిమా చేయాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల.. ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఆయన ఊ అంటే మరో క్రేజీ కాంబోను తెరపై చూడవచ్చు.
కాగా, ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్‌సి 15 సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా గడుపుతున్నారు. పూర్తయిన తర్వాత బుజ్జిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. వీటితో పాటు మరికొన్ని కథలు వింటున్నారని సమాచారం. సూర్య కూడా యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఇది ఆయన 42వ సినిమా కాగా, ఈ సినిమా మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. కానీ ఈ సినిమా పేరును ఖరారు చేయలేదు. శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. సూర్యకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. తెలుగులో నేరుగా సినిమా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పుడు హను రాఘవపూడి సినిమాకు సూర్య, రామ్ చరణ్ ఒప్పుకున్నట్లయితే మరో క్రేజీ కాంబో అవుతుంది. మీరూ ఈ కాంబోను తెరపై చూడాలనుకుంటే.. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.