Jabardasth: జబర్ధస్త్.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతున్న పేరు. దానికి ప్రధాన కారణం కిర్రాక్ ఆర్పి ఇచ్చిన సంచలన ఇంటర్వూ. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాక ఆ షోపై, ఆ సంస్థపై చాలా విమర్శలు చేశాడు ఆర్పీ. ఇక అక్కడ నుండి మొదలైన ఈ రచ్చలోకి జబర్దస్త్ తో సంబంధం ఉన్నవారు ఒక్కొక్కరూ వచ్చి చేరుతున్నారు.
ఇందులో భాగంగానే తాజాగా.. జబర్దస్త్ ఏడుకొండలు సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన జబర్దస్త్ కు సంబంధించిన పలు అంశాల గురించి ప్రస్తావించడమే కాకుండా, నాగబాబు, రోజా రెమ్యునరేషన్ విషయంలో కూడా షాకింగ్ నిజాలను బయట పెట్టాడు. నాగబాబు కన్నా రోజాకు రెమ్యూనరేషన్ ఎక్కువ ఇవ్వడానికి కారణం లేకపోలేదని చెబుతూ రెమ్యూనరేషన్ మాట్లాడే సమయంలో జరిగిన ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు.
ఇక నాగబాబు, రోజాల రెమ్యూనరేషన్ మధ్య గల తేడాకు కారణం ఏంటని యాంకర్ ప్రశ్నించగా.. “రోజా ఒకప్పటి హీరోయిన్ కాబట్టి ఆ విషయాన్ని బట్టే ఆమెకు డబ్బులు ఇచ్చాం. ఇక నాగబాబు విషయానికి వస్తే ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాబట్టి అలానే రెమ్యూనరేషన్ ఇచ్చాం” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఏడుకొండలు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఏడుకొండలు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ వీడియో ఓపెన్ చేయండి.