జబర్దస్త్.. తెలుగు బుల్లితెరపై ఈ షో ఒక ప్రభంజనం. సుమారు గత 8 ఏళ్ళ నుండి జబర్దస్త్ ప్రస్థానం నిరంతరాయంగా కొనసాగుతూ వస్తోంది. తెలుగు టెలివిజన్ రంగంలో ఇప్పటికీ ఈ షోకే హయ్యెస్ట్ రేటింగ్స్. ఇంతలా నవ్వులు పంచే జబర్దస్త్ సెట్ లో అందాలకి కూడా కొదవ ఉండదు. ఒకవైపు అనసూయ ఘాటు అందాలు, మరోవైపు రష్మీ లేలేత పరువాలు ప్రేక్షకులను గిలిగింతలు పెడుతూనే ఉంటాయి. అయితే.., ఈ మధ్య కాలంలో ఓ కొత్త అందం వీరిద్దరిని డామినేట్ చేసేస్తోంది. ఆమె ఎవరో కాదు.., జబర్దస్త్ వర్ష.
వర్ష రాకముందు కూడా జబర్డస్త్ లో జంటలకు కొదవ లేదు. హైపర్ ఆది అనసూయ, రష్మీ సుధీర్ జంటలు ప్రేక్షకులని ఇలానే ఆకట్టుకుంటూ వచ్చాయి. కానీ.., వర్ష వచ్చాక ఇమాన్యూయేల్ కి బాగా దగ్గరైంది. వీరిద్దరి జంట మిగతా పెయిర్స్ ని కూడా డామినేట్ చేసే స్థాయికి వెళ్ళింది. ఇక ఇప్పటికే చాలా మంది వర్ష, ఇమాన్యూయేల్ నిజంగా ప్రేమలో ఉన్నారని ఫిక్స్ అయిపోయారు కూడా. కానీ.., వీరు మాత్రం ఈ విషయంలో ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ.., తాజాగా జడ్జ్ రోజా మాటలకి వర్ష స్టేజ్ పైనే ఏడ్చేయడం అందరిని షాక్ కి గురి చేస్తోంది.
వర్ష ప్రస్తుతం ఇమాన్యూయేల్ కలసి ఎక్కువగా స్కిట్స్ చేస్తోంది. తాజాగా విడుదలైన పోగ్రామ్ ప్రోమోలో కూడా వీరిద్దరి స్కిట్ ఉంది. స్కిట్ లో భాగంగా వర్ష, ఇమాన్యూయేల్ ప్రేమించుకొని పెళ్లి మాత్రం చేసుకోలేకపోతారు. వర్షను పెళ్లాడాల్సిన ఇమ్మానుయేల్ అనుకోని పరిస్థితుల్లో వేరే అమ్మాయి మెడలో తాళి కట్టేస్తాడు. దీంతో వర్ష తెగ ఫీలై పోతుంది. అయితే ఈ స్కిట్ పూర్తయ్యాక.. రోజా రియాక్ట్ అవుతూ వర్ష ప్రేమపై కామెంట్ చేసింది.
వర్ష.. స్కిట్ లో ఇమాన్యూయేల్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటేనే ఇంతలా బాధపడిపోతున్నావు. మరి.., నిజంగా ఇమాన్యూయేల్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నించింది. వర్ష ఈ ప్రశ్నకి సమాధానం చెప్తూ కన్నీరు పెట్టేసింది. ప్రేమించిన వాడి జీవితంలో మనం కాకుండా వేరే అమ్మాయి ఉందన్న ఆలోచన తట్టుకోలేనిది. ఆ బాధ భరించలేనిది అంటూ సమాధానం చెప్తూ.., వర్ష ఒక్కసారిగా స్టేజ్ పైనే ఏడ్చేసింది. దీంతో.., అక్కడే ఉన్న ఇమాన్యూయేల్, రోజా కూడా షాక్ అయిపోయారు. ఈ ప్రోమో చూసిన వారికి కూడా ఇమాన్యూయేల్ పై వర్షకి ఇంత ప్రేమ ఉందాన్న అనుమానం కలగక మానదు. మరి.., ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.