Satya Sri: కొన్నేళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులకు నిరంతరం ఎంటర్టైన్ మెంట్ అందిస్తున్న కామెడీ షోలలో జబర్దస్త్ ఒకటి. సాధారణంగా జబర్దస్త్ గురించి తెలియని తెలుగువారుండరు. టాలెంట్ ఉన్న ఎంతోమంది జబర్దస్త్ వేదికపై సెలబ్రిటీలుగా మారారు. దాదాపు ఎనిమిదేళ్ల నుండి విజయవంతంగా ప్రసారమవుతున్న జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా ఫస్ట్ ఎంట్రీ ఇచ్చింది సత్య శ్రీ.
జబర్దస్త్ కి ముందు సినిమాలలో చిన్నచిన్న పాత్రలలో మెరిసిన సత్యశ్రీ.. చమ్మక్ చంద్ర టీమ్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది. బయట ఎవరికీ పెద్దగా పరిచయం లేదని సత్యశ్రీ.. జబర్దస్త్ లో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. అలాగే సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది.
జబర్దస్త్ లో తొలి లేడీ కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సత్యశ్రీ.. చమ్మక్ చంద్రతో పాటు జబర్దస్త్ నుండి బయటకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం వేరే టీవీ షోలలో పాల్గొంటూ సినిమాలు కంటిన్యూ చేస్తుంది. ఇదిలా ఉండగా.. ఇటీవలే సత్యశ్రీ సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొని కెరీర్ కి సంబంధించి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్న సత్యశ్రీ.. మధ్యలో మంచు లక్ష్మిని ఇమిటేట్ చేయడం హైలైట్ గా నిలిచింది. ఇప్పుడు సత్యశ్రీ మంచు లక్ష్మిని ఇమిటేట్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.