తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న బుల్లితెర లేడీ కమెడియన్స్ లో జబర్దస్త్ రోహిణి ఒకరు. బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన రోహిణి.. తనశైలి కామెడీ పంచులు, ప్రాసలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఓవైపు జబర్దస్త్ షో చేస్తూనే మరోవైపు టీవీ ప్రోగ్రామ్స్ లో అదరగొడుతుంది. ఈ మధ్య రోహిణి ఎక్కడుంటే అక్కడ తన కామెడీతో నవ్విస్తుందని, ఎప్పుడెప్పుడు జబర్దస్త్ లో తన స్కిట్స్ చూద్దామా అని వెయిట్ చేస్తుంటారు ప్రేక్షకులు.
ఈ క్రమంలో ఇటీవలే రోహిణి తన సొంతింటి కల నెరవేర్చుకొని తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే తన కొత్త ఇల్లుకు సంబంధించి హోమ్ టూర్ వీడియో కూడా చేసి ఇల్లంతా ఫ్యాన్స్ కి చూపించింది. ఆ విధంగా యూట్యూబ్ లో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక తాజాగా రోహిణి లండన్ టూర్ వెళ్ళింది. లండన్ లో తాను వెళ్తున్న ప్రదేశాలు, ప్రయాణాలు ఇలా అన్నింటినీ కెమెరాలో బంధిస్తూ వీడియోలు పోస్ట్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో రోహిణి పోస్ట్ చేసిన ఓ కొత్త వీడియో యూట్యూబ్ లో తెగ వైరల్ అవుతోంది. ఎందుకంటే.. రోహిణి ఆ వీడియోలో లండన్ లోని 1000 ఏళ్ళనాటి పబ్ ను చూపిస్తూ వీడియో చేసింది. ఆ వీడియోలో పాత వస్తువులు, జంతువుల గుర్తులు.. ఇలా పబ్ లో ఫేమస్ ఫుడ్ ఇలా అన్నీ టూరిస్ట్ లతో కలిసి వీడియోలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం రోహిణి వీడియో నెట్టింట నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. మరి రోహిణి చూపిన పురాతన లండన్ పబ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.