జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన కమెడియన్స్ లో జబర్దస్త్ రాకేష్ ఒకరు. ఎన్నో ఏళ్లుగా రాకింగ్ రాకేష్ అని టీమ్ పేరుతో స్కిట్స్ చేస్తూ జనాలను ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా జోర్దార్ సుజాత ప్రేమాయణం నడుపుతున్నాడంటూ వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే.. జబర్దస్త్ లో స్కిట్స్ సంగతి పక్కన పెడితే.. సుజాతతో ప్రేమ నిజమా కాదా అనేది తేల్చి చెప్పకపోవడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ తో పాటు కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. రాకేష్ ఎక్కడికి వెళ్లినా అక్కడ సుజాత కనిపిస్తుండటం గమనార్హం.
దీంతో ఇద్దరి మధ్య ఎలాంటి స్పెషల్ బాండ్ లేకుండానే ఇలా చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారా? అంటున్నారు నెటిజన్స్. అదీగాక వీరిద్దరూ కలిసి ఆ మధ్య గోవా ట్రిప్ కి కూడా వెళ్లొచ్చారు. ఇద్దరూ కలిసి రెగ్యులర్ గా ఇన్ స్టాగ్రామ్ వీడియోలు, యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటున్నారు. ఈ క్రమంలో రాకేష్ తన ఫ్యామిలీకి ఎంత దగ్గరగా ఉంటాడో చెప్పక్కర్లేదు. ఎప్పుడు తన ఫ్యామిలీ ప్రస్తావన వచ్చినా ఎమోషనల్ అయిపోతుంటాడు. అయితే.. జబర్దస్త్ ఒక్కటే కాకుండా అప్పుడప్పుడు వేరే టీవీ షోలలో కూడా సుజాతతో కలిసి స్కిట్స్, డాన్స్ పెర్ఫార్మన్స్ లు చేస్తుంటాడు రాకేష్.
ఇదిలా ఉండగా.. తాజాగా రాకింగ్ రాకేష్ కి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రాకేష్ కంటే ముందే అతని తమ్ముడికి ముందే పెళ్లి అయిపోయిన విషయం తెలిసిందే. 2021 జనవరిలో రాకేష్ తమ్ముడి వివాహం జరిగింది. ఆ పెళ్లికి సుజాత కూడా వెళ్లడం విశేషం. ఇక ఇటీవల రాకేష్ తమ్ముడి కూతురు నక్షత్ర మొదటి బర్త్ డే సెలబ్రేట్ చేశారట. ఈ వేడుకకు రాకేష్ తో పాటు జోర్దార్ సుజాత, శివబాలాజీ, ధన్ రాజ్ లాంటి సెలబ్రిటీలు పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. మరి ఆ ఫోటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి!