ఇటీవల జబర్దస్త్ షో కొత్త ప్రోమో రిలీజ్ అయినప్పటి నుండి అందరూ కొత్త యాంకర్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇన్నేళ్ళపాటు జబర్దస్త్ ని హోస్ట్ చేసిన యాంకర్ అనసూయ, రష్మీ గౌతమ్ ల తర్వాత కొత్తగా సీరియల్ నటిని హోస్ట్ గా ఇంట్రడ్యూస్ చేశారు నిర్వాహకులు. జబర్దస్త్ కి కొత్త యాంకర్ గా వచ్చింది సీరియల్ నటి సౌమ్య రావు. చూడటానికి హీరోయిన్ల కటౌట్ ఉన్నప్పటికీ, కళ్ళు చూస్తే విలన్ లా కనిపించే సౌమ్య.. సీరియల్స్ లో ఎక్కువగా విలన్ రోల్స్ చేస్తూ వచ్చింది. అయితే.. సీరియల్ ఆర్టిస్ట్ నుండి జబర్దస్త్ యాంకర్ గా వెలుగులోకి వచ్చిన సౌమ్య రావు జర్నీ కూడా అంత ఈజీగా ఏం జరగలేదని తెలుస్తోంది.
సౌమ్య రావు లైఫ్ లో కూడా ఎన్నో ఎదురుదెబ్బలు, విషాదాలు ఉన్నాయని.. వాటి గురించి తెలిస్తే ఎవరైనా కంటతడి పెట్టుకుంటారని పలు కథనాలు చెబుతున్నాయి. అందరికి సౌమ్య నటిగా, యాంకర్ గా మాత్రమే తెలుసని.. కానీ, ఆమె లైఫ్ లో జరిగిన బాధాకరమైన విషయాలు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టినట్లు తెలుస్తోంది. 1990లో కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతంలో పుట్టి పెరిగిన సౌమ్య.. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక.. ఓ న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించింది. ఓవైపు న్యూస్ రీడర్ గా టీవీ ఛానల్ లో వర్క్ చేస్తూనే.. మరోవైపు మోడలింగ్ లో పాల్గొనేదట. అలా న్యూస్ రీడర్ గా వర్క్ చేస్తున్నప్పుడే ‘పట్టేదారి ప్రతిభ’ అనే సీరియల్ ద్వారా టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
ఆ సీరియల్ సక్సెస్ అవ్వడంతో తమిళంలో సన్ టీవీ వారు ఆఫర్ ఇచ్చి రోజా అనే సీరియల్ లో లీడ్ రోల్ ఇచ్చారు. అలా అటు తమిళంలో కూడా మంచి గుర్తింపు వచ్చేసరికి.. నెగటివ్ రోల్స్ లో కూడా తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. అక్కడి నుండి శ్రీమంతుడు అనే సీరియల్ ద్వారా తెలుగులోకి ప్రవేశించింది. ప్రస్తుతం తెలుగులో శ్రీమంతుడు ఒక్కటే కాకుండా పలు సీరియల్స్ లో విలన్ రోల్స్ చేస్తూ మెప్పిస్తోంది. ఈ క్రమంలో రీసెంట్ గా జరిగిన ఓ ప్రోగ్రాంలో హైపర్ ఆది, రామ్ ప్రసాద్ లను స్టేజిపై ఓ ఆటాడుకొని అందరిని ఇంప్రెస్ చేసింది. అలా జబర్దస్త్ యాజమాన్యం.. సౌమ్య రావునే కొత్త యాంకర్ గా బాగుంటుందని ఇంట్రడ్యూస్ చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా.. సౌమ్య రావు కెమెరా ముందు ఇంత హ్యాపీగా కనిపిస్తున్నా.. ఆమె పర్సనల్ లైఫ్ లో ఎంతో విషాదం ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పిందట. తనకు అమ్మానాన్న, అక్కాచెల్లి ఇలా ఎవరూ లేరని.. తాను కెరీర్ లో ఎదిగాకే వారి గురించి మాట్లాడతానని తెలిపిందట. అయితే.. సౌమ్య రావు అసలు పేరు సౌమ్య శారద. చిన్నప్పటి నుండే తండ్రి ప్రేమకు దూరమైన సౌమ్య.. తల్లి క్యాన్సర్ తో బాధపడటం చూసి తట్టుకోలేకపోయేదట. తనను అల్లారుముద్దుగా పెంచిన తల్లికి తానే దగ్గరుండి కొన్నేళ్లపాటు సేవ చేసుకుంటూ వచ్చింది సౌమ్య.
ఇక 2019లో తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. కన్నడ, తమిళ భాషలు అనర్గళంగా మాట్లాడే సౌమ్య ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటోంది. అయితే.. సౌమ్య సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గానే ఉంటుంది. కానీ.. తన పర్సనల్, ఫ్యామిలీ విషయాలు, ఫోటోలు మాత్రం షేర్ చేయకపోవడం గమనార్హం. సీరియల్ ఆర్టిస్ట్ గా బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన సౌమ్య.. ఇప్పుడు జబర్దస్త్ లో వచ్చీరాని తెలుగులో మాట్లాడుతూ యాంకరింగ్ చేస్తోంది. జబర్దస్త్ కొత్త ప్రోమో విడుదలైనప్పటి నుండి సౌమ్య గురించి తెలుసుకోవాలని, ఆమె వివరాల కోసం ఆరా తీస్తున్నారు నెటిజన్స్. చూడాలి మరి త్వరలో సౌమ్య తన ఫ్యామిలీని పరిచయం చేస్తుందేమో!