జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్స్ లో కిరాక్ ఆర్పీ ఒకరు. మొదటి నుండి ఆర్పీ చేసిన స్కిట్స్ జబర్దస్త్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరి మధ్యలో ఏమైందోకానీ సడన్ గా జబర్దస్త్ నుండి వెళ్ళిపోయాడు. తర్వాత అడపాదడపా పలు టీవీ షోలలో దర్శనమిచ్చాడు. అయితే.. త్వరలోనే ఆర్పీ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవలే బంధువులు, సన్నిహితుల మధ్య నిశ్చితార్థం చేసుకొని వార్తల్లో నిలిచాడు.
గత కొంతకాలంగా ఎలాంటి షోలో కనిపించని ఆర్పీ.. తాజాగా పెళ్లి కొడుకు అవతారంలో కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. ప్రస్తుతం కిరాక్ ఆర్పీ ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బుల్లితెరపై ఒక్కో జంట పెళ్లి పీటలెక్కుతున్న తరుణంలో కిరాక్ ఆర్పీ.. ప్రేమించిన అమ్మాయి లక్ష్మినే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. కొన్నేళ్లుగా ఆర్పీ, లక్ష్మీ ఇద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నారు.
కిరాక్ ఆర్పీ ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి జబర్దస్త్ కమెడియన్లు, సినీ పరిశ్రమలో ఆయనకు సన్నిహితంగా ఉన్న మరికొందరు హాజరయ్యారు. మరోవైపు జబర్దస్త్ కెమెడియన్ ధన్ రాజ్ కుటుంబసమేతంగా హాజరయ్యాడు. ఇందుకు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. త్వరలోనే ఈ కిరాక్ ఆర్పీ జంట మంచి ముహూర్తపు రోజున పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఇదిలా ఉండగా.. కిరాక్ ఆర్పీ త్వరలో దర్శకుడిగా డెబ్యూ చేయబోతున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమం జరుపుకున్న ఆ సినిమా షూటింగ్ దశలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే మరి కిరాక్ ఆర్పీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.