ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు. పుష్పరాజ్ గా అల్లు అర్జున్ కనబరిచిన నేటివ్ మాస్ నటనకి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. పుష్పరాజ్ క్యారెక్టర్ కోసం అల్లు అర్జున్ మేకోవర్, బాడీ లాంగ్వేజ్ సినిమాకే ప్లస్ అయింది. డైరెక్టర్ సుకుమార్ సినిమా రిలీజ్ ముందు చెప్పినట్లుగానే కొత్త అల్లు అర్జున్ ని చూశారు ప్రేక్షకులు.
ఇక పుష్ప సినిమాతో బన్నీకి బాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. అంచనా వేసిన దానికంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టి ఆశ్చర్యపరిచింది పుష్ప. అలాంటి నేచురల్ మాస్ లుక్కులో మరో టాలీవుడ్ హీరోని చూడాలని కోరుకుంటున్నారు ప్రేక్షకులు. అతనే జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడున్న టాలీవుడ్ స్టార్స్ లో నటన పరంగా అద్భుతమైన సామర్థ్యాలు కలిగిన ఎన్టీఆర్.. ఇప్పటివరకు పుష్ప లాంటి రఫ్ అండ్ టఫ్ మాస్ లుక్కులో కనిపించలేదు. ప్రతి సినిమాకి భిన్నమైన పాత్రలు ప్రయత్నిస్తున్నాడు కానీ అవన్నీ రెగ్యులర్ సినిమాల మాదిరే ఉండిపోవడం బాధాకరం. నిజానికి ఎన్టీఆర్ కంఫర్ట్ జోన్ పాత్రల నుండి బయటికి రాలేదని ఫ్యాన్స్ వాపోతున్నారు.
రెగ్యులర్ సినిమాల్లో మంచి నటన కనబరిస్తే సరిపోదని, ఎన్టీఆర్ నుండి ఇంకా రావాల్సింది, రాబట్టాల్సింది చాలా ఉందని అంటున్నారు నందమూరి అభిమానులు. ఎన్టీఆర్ RRR సినిమాలో కొమరం భీమ్ క్యారెక్టర్ చేశాడు. కానీ అది మల్టీస్టారర్. ఇంతవరకు రెగ్యులర్ సినిమాలు చేసిన అల్లు అర్జున్, రాంచరణ్ లాంటి స్టార్స్ కొత్తగా ట్రై చేస్తున్నారు. ఇకనైనా ఎన్టీఆర్ పూర్తి స్థాయి డిఫరెంట్ రోల్స్ చేస్తేనే తనలోని యాక్టింగ్ టాలెంట్ కి న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ కూడా పుష్ప లాంటి మాస్ నేటివ్ క్యారెక్టర్ కోసం చూస్తున్నాడట. మరి ఎన్టీఆర్ ని మాస్ రఫ్ లుక్కులో చూడాలనుకునే వారు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.