రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన కేజీఎఫ్ చాప్టర్-1, చాప్టర్-2 సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మాసివ్ మూవీ సిరీస్.. కలెక్షన్స్ పరంగా రికార్డులు తిరగరాసింది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ లో విజయ్ కిరగందుర్ నిర్మించిన కేజీఎఫ్-2 సినిమా 1200కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అలాగే బుక్ మై షోలో కూడా ఆల్ టైమ్ రికార్డు సెట్ చేసింది.
ఇక కేజీఎఫ్-3 సినిమాపై సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. KGF-3లో బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్ నటించనున్నాడని టాక్ నడుస్తుంది. ఈ విషయమై కేజీఎఫ్ మేకర్స్ హృతిక్ తో చర్చలు జరిపారని కథనాలు హల్చల్ చేశాయి. తాజాగా ఈ వార్తలపై కేజీఎఫ్ ప్రొడ్యూసర్ విజయ్ కిరగందుర్ స్పందించినట్లు తెలుస్తుంది. ఆయన మాట్లాడుతూ.. “కేజీఎఫ్-3 ఈ ఏడాది ఉండదు. దాని కోసం మేము ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ‘సలార్’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అటు యష్ కూడా వేరే కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయనున్నాడు.
మా అందరికీ టైమ్ కుదిరినప్పుడు కేజీఎఫ్-3 గురించి ఆలోచిస్తాము. ఇప్పటివరకూ ఏ స్టార్ ను యాడ్ చేయాలో ఆలోచించలేదు. హృతిక్ రోషన్ నటిస్తారో లేదో ఇప్పుడే చెప్పలేము. సినిమా స్టార్ట్ అయితే.. ఎవరెవరు కావాలో వారిని సంప్రదిస్తాం” అని విజయ్ క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కేజీఎఫ్ మేకర్స్ డార్లింగ్ ప్రభాస్ తో ‘సలార్’ తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్.. జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయనున్నాడు. కాబట్టి KGF-3 ఇప్పట్లో వస్తుందనే గ్యారంటీ లేదు. మరి కేజీఎఫ్-3 పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Waiting for KGF chapter 3🔥🔥🔥@TheNameIsYash @hombalefilms pic.twitter.com/cvlUDstWLu
— Tharun_2003 (@Tharunpendyala) May 23, 2022
World isn’t ready to accept what’s Coming 🔥🔥#KGF3 #Salaar #NTR31#PrashantNeel #KGFChapter2 pic.twitter.com/PxdkQhBUtY
— Yash Fc Hubli (@Yashfanshubli) May 21, 2022