సినీ ఇండస్ట్రీలో హిట్స్, ప్లాప్స్ అనేవి ఎవరికైనా మామూలే. హిట్స్ తో కెరీర్ మొదలైనవారు కొంతకాలం తర్వాత అయినా ప్లాప్స్ ని చవిచూస్తుంటారు. అలాగే ప్లాప్స్ తర్వాత వరుస హిట్స్ అందుకున్నవారు కూడా ఉన్నారు. అయితే.. హిట్స్, ప్లాప్స్ ఏవైనా హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఎవరి విషయంలోనైనా సమానమే. ఇండస్ట్రీలో ప్రతి హీరో, ప్రతి దర్శకుడు హిట్టు కొట్టాలనే సినిమాలు చేస్తుంటారు. కానీ.. ఎంచుకున్న స్టోరీ, స్క్రీన్ ప్లే, లాజిక్స్ ఇలా ఏ విషయంలో తగ్గినా లేదా లాజిక్స్ లోపించినా సినిమాలు బోల్తా కొడుతుంటాయి.
ఇక కెరీర్ ప్రారంభంలోనే స్టార్ హీరోలతో కథలు ఓకే అనిపించుకుంటున్న యువదర్శకులు.. తీరా సినిమా ఎక్సిక్యూషన్ విషయానికి వచ్చేసరికి తడబడుతూ.. అభిమానుల అంచనాలు అందుకోలేక భారీ ప్లాప్ లను మూటగట్టుకుంటున్నారు. అలా టాలీవుడ్ లో రీసెంట్ గా డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ ను చూశాం. డార్లింగ్ ప్రభాస్ తో పాన్ ఇండియా స్థాయిలో రాధేశ్యామ్ మూవీ తీసి భారీ ప్లాప్ ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా వచ్చి కూడా దాదాపు ఆరు నెలల పైనే అవుతోంది. కానీ.. ఇంతవరకు తన తదుపరి సినిమా ఏంటి? ఎవరితో అనేది ప్రకటించలేదు.
ఇదిలా ఉండగా.. తాజాగా డైరెక్టర్ రాధాకృష్ణ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదేనంటూ ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. ఈసారి ర్యాంప్ రాధాకృష్ణకు ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని అవకాశం ఇవ్వనున్నాడనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అదీగాక ఆల్రెడీ రాధాకృష్ణ, రామ్ ల మధ్య కథా చర్చలు కూడా జరిగాయని టాక్. రాధాకృష్ణ ఈసారి పూర్తి యాక్షన్ ఎంటర్టైన్ మెంట్ జానర్ లో కథ రెడీ చేశాడని.. దానికి రామ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. అంతేగాక త్వరలోనే రామ్ 21వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ అధికారికంగా అనౌన్స్ చేయనున్నారని సినీవర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం హీరో రామ్ కూడా ఓ మాసివ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఇప్పటివరకూ రామ్ చేసిన సినిమాలేవీ హిట్ అవ్వలేదు. డ్యూయెల్ రోల్ లో కనిపించిన రెడ్, ఇటీవల ది వారియర్ రెండూ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమయ్యాయి. ఇక మరోవైపు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు రామ్. మరి ఆ సినిమాతో అయినా తిరిగి ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి. అలాగే రాధాకృష్ణతో సినిమాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి రామ్ – రాధాకృష్ణ కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.