పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమాకు, ఆ సినిమాలోని సన్నివేశాలకు ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమా.. పవన్ కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోయింది. ఈ సినిమాలో పవన్ సరసన భూమిక చావ్లా హీరోయిన్ గా నటించింది. అయితే.. ఖుషి సినిమా అనగానే అందరికి గుర్తొచ్చే సీన్ నడుము సీన్. ఎవర్ గ్రీన్ సీన్ గా నిలిచిన ఆ సీన్.. ఇప్పుడు మెగాస్టార్ సినిమాలో రిపీట్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం.. మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’ సినిమాలో ఖుషి సీన్ ప్లాన్ చేసినట్లు టాక్. అయితే.. ఈ సీన్ లో కనిపించబోయేది హీరోయిన్ కాదట. తెలుగు పాపులర్ యాంకర్స్ లో ఒకరైన శ్రీముఖి.. మెగాస్టార్ తో కలిసి ఖుషి నడుము సీన్ లో కనిపించనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ కాగా, కీర్తిసురేష్ చిరుకి సోదరిగా నటిస్తోంది.
మామూలుగానే మెగాస్టార్ రొమాంటిక్ హావభావాలకు ఫ్యాన్ బేస్ ఓ రేంజిలో ఉంటుంది. అలాంటిది ఖుషి సీన్ లో మెగాస్టార్ కనిపించబోతున్నాడంటే.. అందులోనూ యాంకర్ శ్రీముఖి నటించనుందని తెలిసేసరికి మెగాఫ్యాన్స్ లో ఆనందం రెట్టింపు అయ్యింది. ఎందుకంటే.. తమ్ముడు పవన్ కళ్యాణ్ సీన్ ని మెగాస్టార్ రిపీట్ చేయడం అనేది విశేషం అంటున్నారు ఫ్యాన్స్. ఇక అందులో శ్రీముఖి అనేసరికి ఆమె ఫ్యాన్స్ కూడా ఖుషి అవుతున్నారు. మరి ఖుషి సీన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.