తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఒక నటుడిగా యువతరానికి ఎంతో స్ఫూర్తిగా నిలిచిన మెగాస్టార్ కి దేశంలోనే కాదు విదేశాల్లో కోట్లమంది అభిమానులు ఉన్నారు.
తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా స్వయంకృషితో కోట్ల మంది అభిమానాన్ని పొందిన నటుడు మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవికి అభిమానులు మాత్రమే కాదు.. అభిమాన తారాగణం కూడా ఉన్నారు. “జగదేకవీరుడు అతిలోకసుందరి” మూవీలో జై చిరంజీవా.. జగదేక వీరా.. అసహాయశూరా అంజని కుమారా.. అంటూ ఆంజనేయస్వామి ఔన్నత్యాన్ని మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ కి అనుసంధానం చేస్తూ వేటూరి సుందరరామ మూర్తి రాసిన పాట సినిమాకు ఎంత హిట్ అయ్యిందో.. చిరంజీవి వ్యక్తిగత జీవితాన్ని కూడా అంతగొప్పగా ఇనుమడింప జేసింది. ‘జగదేక వీరా అసహాయ శూరా’ అన్న పదాలు చిరంజీవి నిజ జీవితానికి కూడా ఖచ్చితంగా అన్వయం అవుతాయి అనడంలో అతిశయోక్తి లేదు. దేశ విదేశాల్లో ఆయనకు ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఇండస్ట్రీలో కానీ మరెక్కడైనా కానీ జీవితంలో గొప్ప లక్ష్యాలను సాధించడానికి మీ స్ఫూర్తి ఎవరు అంటే చాలా మంది మెగాస్టార్ చిరంజీవి అని చెబుతుంటారు.
భారత దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో మోగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న అభిమానులు ఎంతోమంది ఉన్నారు. విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధులకు సైతం మెగాస్టార్ చిరంజీవే స్ఫూర్తి ప్రదాత అనటానికి నిదర్శనంగా చైనా బీజింగ్ లో జరిగిన ఒక సంఘటన నిదర్శనంగా నిలుస్తుంది. చైనా రాజధాని బీజింగ్ సమీపంలోని జంజో 26 అనే గవర్నమెంట్ మిడిల్ స్కూల్ లో టీచర్ స్టూడెంట్స్ కు ‘మీకు నచ్చిన ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ గురించి ఒక ఆడియో విజువల్ ప్రజెంటేషన్ ఇవ్వండి ‘ అంటూ ఒక ఎస్సైన్మెంట్ ఇచ్చింది. ఆ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న జిస్మిత అనే అమ్మాయి మెగాస్టార్ చిరంజీవి మీద ఒక ఆడియో విజువల్ ఇస్తానని చెప్పిందట. బాలిక చెప్పిన మాటలు విన్న టీచర్స్ ఆశ్చర్యపోయారట.
ఇంతకీ చిరంజీవి ఎవరు? అని టీచర్ అడిగితే గూగుల్ లోకి వెళ్ళి మెగాస్టార్ విశ్వరూపాన్ని చూపించిందట. వాస్తవానికి అక్కడ భారతీయులను ఇన్స్పిరేషన్ గా చెప్పటాన్ని అక్కడ అనుమతించరట. కానీ.. జిస్మిత చెప్పిన మాటలు.. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గూగుల్ సర్చ్ లో చిరంజీవి గురించి తెలుసుకున్న టీచర్ ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారట.. నిజంగా ఆయన స్ఫూర్తిదాయకుడు… పూర్తి వివరాలు చెప్పమని కోరాడట. అలా జిస్మిత మెగాస్టార్ చిరంజీవి గురించి 5 నిమిషాల పాటు విజువల్ రూపొందించి ప్రదర్శించడమే కాకుండా క్లాస్ రూమ్ లో ఆయన గురించి అనర్గళంగా మాట్లాడటంతో అక్కడ ఉన్నవారంతా చప్పట్లతో జిస్మితను అభినందించారట.
ఇంతకీ అసలు జిస్మిత ఎవరంటే.. మెగాస్టార్ చిరంజీవి ఇన్స్పిరేషన్ తో డాన్స్ నేర్చుకొని ఎన్నెన్నో డాన్స్ కాంపిటీషన్స్ లో ఫైనలిస్ట్ గా నిలిచి ఆపై చైనా వెళ్లి అక్కడ డాన్స్ ఇన్స్టిట్యూట్స్ స్థాపించి ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్ గా ఎదిగిన అమలాపురానికి చెందిన కొణతాల విజయ్ కుమార్తే ఈ జస్మిత. మొదటి నుంచి మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని డ్యాన్స్ పర్ఫామెన్స్ తో తమకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు విజయ్ అతని భార్య జ్యోతి. డాన్స్ లోనూ, యోగాలోను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన ఏకైక జంటగా రికార్డ్ సృష్టించారు. ఈ విధంగా మెగాస్టార్ స్ఫూర్తి దేశాల ఎల్లలు దాటి విశ్వవ్యాప్తం కావటం అభినందనీయం… హ్యాట్సాఫ్ మెగాస్టార్.