మెగాస్టార్ చిరంజీవి.. ఖైదీ నెం.150 మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు. చిరంజీవి, రవితేజ కాంబినేషన్ లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే.
తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు. ఈ ఏడాది బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహరాజ రవితేజ కలిసి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్ బస్టర్ విజయం అందుకొని రెండు వందల రోజులు ఫంక్షన్ గ్రాండ్ గా జరుపుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ మూవీ రిలీజ్ కి ముందు కొన్ని అడ్డంకులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. దీంతో మెగా అభిమానులు తెగ సంబరాలు చేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే..
ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, తమ్నా, కీర్తి సురేష్, సుశాంత్ నటిస్తున్న ‘భోళా శంకర్’మూవీ రిలీజ్ కి కొన్ని అడ్డంకులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ విడుదలకు అంతా లైన్ క్లీయర్ కావడంతో రేపు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. గాయత్రి ఫిలిమ్స్ పిలీషన్ ను హైదరాబాద్ సిలీ సివిల్ కోర్టు గురువారం డిస్మిస్ చేయడంతో మూవీ శుక్రవారం థియేటర్లలో సందడి చేయబోతుంది. ఇప్పటి వరకు కోర్టులో పిటీషన్ ఉండటంతో అభిమానుల్లో సందిగ్ధత కనిపించింది. తాజాగా కోర్టు నిర్ణయంతో ఆగస్ట్ 11న మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్ ’మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
భోళా శంకర్ ప్రొడ్యూసర్ అనీల్ సుంకర తనను మోసం చేశాడంటూ డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన చిత్రం విడుదల ఆపివేయాలంటూ కోర్టులో పిటీషన్ వేశారు. దీంతో ఆగస్ట్ 11న మూవీ రిలీజ్ పై కాస్త సందిగ్ధత ఏర్పడింది. అసలు వివాదానికి గల కారణం ఏంటంటే.. ఈ మూవీ నిర్మాతగా ఉన్న ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర.. గతంలో తమకు పెండింగ్ ఉన్న బ్యాలెన్స్ చెల్లించలేదని.. అడిగితే నిర్లక్ష్య వైఖరి వహించారని విశాఖకు చెందిన గాయత్రి ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్ హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోర్టులో విచారణ కొనసాగుతుంది. ఈ రోజు మరోసారి కోర్టులో వాదనలు జరిగాయి. వాదనలు ముగిసిన తర్వాత భోళా శంకర్ నిర్మాత అనీల్ సుంకరకు అనుకూలంగా తీర్పు రావడంతో మూవీ రిలీజ్ కి లైక్ క్లీయర్ అయ్యింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు.