చిత్ర పరిశ్రమలో హీరోయిన్ ల కెరీర్ టైమ్ చాలా తక్కువ. అడపా దడపా కొంత మంది భామలు లాంగ్ కెరీర్ కొనసాగించినప్పటికీ చాలా మంది మాత్రం మధ్యలోనే ఇండస్ట్రీ నుంచి కనుమరుగు అవుతారు. మరికొందరు పెద్ద పెద్ద సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఉంటారు. అదీ కాక బుల్లితెర షోలల్లో మెరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓ బుల్లితెర షోకి జడ్జిగా వ్యవహరించిన నటి వివాహం ఆగిపోయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే..
షామ్నా ఖాసీం.. అంటే ఎవరికీ తెలిదు అదే పూర్ణ.. అంటే చాలు వెంటనే గుర్తుకు వస్తుంది. సీమటపాకాయ్, అవును, అవును-2 లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు పూర్ణ. ప్రస్తుతం పలు బుల్లితెర షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ‘ఢీ-13’ డ్యాన్స్ షో కి జడ్జిగా వ్యవహరించింది. ఆ షో ద్వారా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం పూర్ణకు సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
గతంలో పెద్దల అంగీకారంతో దుబాయ్ కు చెందిన వ్యాపార వేత్త అయిన షానిద్ అసిఫ్ అలీతో పూర్ణ నిశ్చితార్థం జరిగింది. అప్పట్లో ఆ ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. ఈక్రమంలో పెళ్లి తర్వాత పరిశ్రమకు దూరం అవుతుంది అని వార్తలు వచ్చాయి. వాటిని పూర్ణ ఖండించారు. తాను పరిశ్రమలో కొనసాగడం తన భర్తకు ఇష్టమే అని ఆమె అప్పట్లోనే తెలిపారు. దీంతో త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతుందని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో పూర్ణ పెళ్లి ఆగిపోయిందంటూ పరిశ్రమంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే పూర్ణ మాత్రం ఈ వార్తలపై ఎలాంటి ప్రకటన చెయ్యలేదు.
అయితే పూర్ణ తన వివాహాన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి కారణం ఓ దర్శకుడు అంటూ ఇండస్ట్రీలో వినికిడి. అతడితో ఆమె ప్రేమలో ఉందని, అందుకోసమే తన పెళ్లిని క్యాన్సిల్ చేసుకుందంటూ ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తలపై పూర్ణ ఏవిధంగా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి. పూర్ణ పెళ్లి టాపిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.