హీరోయిన్ పూర్ణ ఓ పెళ్లిలో భర్తతో పాటు కొడుకుతో హాజరై సందడి చేసింది. ఏడాది నిండని తన కొడుకును ప్రపంచానికి పరిచయం చేసింది. సోషల్ మీడియా ఆ ఫొటోలు వైరల్ గా మారాయి.
నటి పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కేరళకు చెందిన ఈ ముద్దుగుమ్మ నటి, డ్యాన్సర్, మోడల్ గా అందరికి సుపరిచితమే. ఈ అందాల ముద్దుగుమ్మ తెలుగు, మళయాలం, తమిళం సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. వెండితెరపై సందడి చేయడంతో పాటు ఓ టీవీ షోలో జడ్జిగా వ్యవహరించింది. తెలుగులో వచ్చిన అవును, సీమటపాకాయ్ సినిమాలు హీరోయిన్ పూర్ణకు మంచి పేరు తీసుకువచ్చాయి. కాగా నటి పూర్ణ గత సంవత్సరం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన కొడుకును ఇన్ స్టాగ్రామ్ వేదికగా ప్రపంచానికి పరిచయం చేసింది. పూర్ణ కొడుకును చూసిన నెటిజన్స్ చాలా ముద్దుగా అందంగా ఉన్నాడంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
సాధారణంగా సెలబ్రిటీలు వారి పిల్లలను మీడియాకు చిక్కకుండా జాగ్రత్తపడుతుంటారు. పబ్లిక్ ప్లేస్ లోకి వచ్చినప్పుడు వారి పిల్లల ఫొటోలు తీయకుండా ఫొటోగ్రాఫర్లను అడ్డుకుంటారు. కొంత వయసు వచ్చేంతవరకు వారి ఫొటోలను బయటపెట్టరు. ఈ కోవాలో సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలతో పాటు క్రీడా రంగానికి చెందిన కొందరు సెలబ్రిటీలు వారి పిల్లల విషయాల పట్ల గోప్యంగా వ్యవహరిస్తారు. కాగా హీరోయిన్ పూర్ణ 2022 జూన్ 12న దుబాయ్ కి చెందిన బిజినెస్ మేన్ అసిఫ్ అలీని వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది నటి పూర్ణ.
ఇప్పటి వరకు తన కొడుకును బాహ్య ప్రపంచానికి పరిచయం చేయలేదు. తాజాగా ఓ పెళ్లి ఫంక్షన్ కు భర్త ఆసిఫ్ అలీతో పాటు కొడుకుతో హాజరయ్యారు పూర్ణ. ఈ సందర్భంగా అక్కడ తీయించుకున్న ఫొటోలను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫొటోల ద్వారా తన కొడుకును మొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేసింది. దీంతో క్షణాల్లోనే ఆ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇది చూసిన నెటిజన్స్ పూర్ణ కొడుకు చాలా అందంగా ఉన్నాడంటూ కామెంట్ చేస్తున్నారు.