Shraddha Srinath: ‘జెర్సీ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్. నాని హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ‘జెర్సీ’లో శ్రద్ధా శ్రీనాథ్ నటనకు గానూ మంచి మార్కులే పడ్డాయి. ‘జెర్సీ’ తర్వాత తెలుగులో ‘జోడీ’, ‘క్రిష్ణ అండ్ హిజ్ లీల’ సినిమాలు చేశారు. తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళంతో పాటు మలయాళం, కన్నడలోనూ సినిమాలు చేస్తున్నారు. ఇక, శ్రద్ధ శ్రీనాథ్ ఓ విషయంలో చాలా ఆవేదన చెందుతున్నారు. తన ఆవేదనను సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నారు. అంతేకాదు! తన బాధకు పరిష్కారంగా తన పేరును సైతం మార్చుకున్నారు. ఇంతకీ సంగతేంటంటే.. శ్రద్ధా శ్రీనాథ్ పేరును కొంతమంది శ్రద్ధా దాస్ అని, శ్రద్ధా కపూర్ అని రాస్తున్నారు. కేవలం నెటిజన్లు మాత్రమే కాదు. కొన్ని మీడియా సంస్థలు కూడా అలానే చేస్తున్నాయి. ఓ మీడియా సంస్థ శ్రద్ధా శ్రీనాథ్ ఫొటో పెట్టి.. శ్రద్ధా దాస్ అని రాసుకొచ్చింది. దాన్ని చూసిన ఆమె ఆవేదన చెందారు. దాని స్క్రీన్ షాట్‌ను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘ ఈ అకౌంట్‌ను ఏ ఇంటర్న్ హ్యాండిల్ చేస్తున్నాడు రా బాబు. 861k ఫాలోవర్స్’ అంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరును శ్రద్ధా రమా శ్రీనాథ్‌గా మార్చుకున్నారు. త్వరలో ట్విటర్‌లో కూడా తన పేరు మార్చుకుంటానని అన్నారు. రమా అన్నది తన తల్లి పేరని వెల్లడించారు. ఇకపై తనను శ్రద్ధా రమా శ్రీనాథ్‌గా పరిచయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. తాను దాస్, కపూర్‌ను కాదని, పెద్ద సినిమా అకౌంట్లను హ్యాండిల్ చేసే వారు కాస్త జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తన పేరును కరెక్ట్‌గా రాసే వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. మరి, శ్రద్ధా శ్రీనాథ్ తన పేరును మార్చుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. Which intern is handling this account ra babu. 861k followers https://t.co/EGGwFDUqFU — Shraddha Srinath (@ShraddhaSrinath) August 3, 2022 I appreciate people who get my name right. So much. Even though your keyboard suggests Das or Kapoor, every fibre of your body tells you that Srinath is the one to type. I appreciate you. I see you. You are loved. — Shraddha Srinath (@ShraddhaSrinath) August 3, 2022 ఇవి కూడా చదవండి: మంచు విష్ణుతో దిల్ రాజు భేటీ! కీలక అంశాలపై చర్చ..